AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్ డి లోపంతో జాగ్రత్త.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి!

శీతాకాలం ప్రారంభం కాగానే, వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. చల్లని వాతావరణం, తక్కువ సూర్యరశ్మి, ఇంట్లో ఎక్కువ సమయం గడపడం వంటివి కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో, శరీరానికి అవసరమైన ఒక విటమిన్ లోపం పెరగవచ్చు. దీనివల్ల అలసట, నీరసం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇంతకీ, ఈ విటమిన్ లోపానికి సంబంధం ఏమిటి?

విటమిన్ డి లోపంతో జాగ్రత్త.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి!
Vitamin D Deficiency in Winter
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2026 | 9:07 AM

Share

చలికాలం రాగానే చాలామందిలో నీరసం, ఒళ్లు నొప్పులు, మానసిక నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి వెనుక విటమిన్ డి లోపం ఒక ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఎముకల ఆరోగ్యానికి, కాల్షియం శోషణకు, రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి విటమిన్ డి ఎంతో అవసరం. అయితే శీతాకాలంలో ఈ పోషక స్థాయిలు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి.

సూర్యరశ్మి తగ్గడం:

విటమిన్ డి పొందడానికి సూర్యరశ్మి అత్యంత సహజమైన వనరు. చలికాలంలో పగటి పూట ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. పొగమంచు, మేఘాలు సూర్యకిరణాలను అడ్డుకోవడం వల్ల చర్మానికి అవసరమైన యూవీబీ కిరణాలు తగినంతగా అందవు.

ఇళ్లకే పరిమితం కావడం,దుస్తులు:

చలిగాలుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే లేదా కార్యాలయాల్లోనే గడుపుతారు.బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు వంటి దుస్తులతో చేతులు, కాళ్లు, ముఖం సహా శరీరంలోని చాలా భాగాలను కప్పుకుంటారు. చర్మం నేరుగా ఎండకు బహిర్గతం కాకపోవడంతో విటమిన్ డి తయారీ తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆహారపు అలవాట్లు, జీవనశైలి:

చలికాలంలో వేడివేడిగా, సులభంగా దొరికే ఆహారాలపై దృష్టి పెడతారు .కానీ విటమిన్ డి ఉండే ఆహారాలను తగినంతగా తీసుకోరు. శారీరక శ్రమ తగ్గడం, వయసు పెరగడం, చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వంటి అంశాలు కూడా విటమిన్ డి లోపానికి దోహదపడతాయి.

నివారణ ఎలా?

ఉదయం లేదా మధ్యాహ్నం ఎండ తీవ్రత మరీ ఎక్కువగా లేని సమయంలో చేతులు, కాళ్లపై కొద్దిసేపు సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. కొవ్వు ఉండే చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, విటమిన్ డి కలిపిన పాలు లేదా తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకుని, అవసరమైన సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సెహ్వాగ్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీకి రెడీ.. బేస్ ప్రైస్ ఎంతో తెలుసా?
సెహ్వాగ్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీకి రెడీ.. బేస్ ప్రైస్ ఎంతో తెలుసా?
మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టె పచ్చిమిర్చి నువ్వుల అన్నం
మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టె పచ్చిమిర్చి నువ్వుల అన్నం
విటమిన్ డి లోపంతో జాగ్రత్త.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి!
విటమిన్ డి లోపంతో జాగ్రత్త.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి!
రేపే అకౌంట్లోకి రూ.2 వేలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేపే అకౌంట్లోకి రూ.2 వేలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సింపుల్‌గా కనిపించే రైనా ఇంట్లో ఇన్ని ప్రత్యేకతలా?
సింపుల్‌గా కనిపించే రైనా ఇంట్లో ఇన్ని ప్రత్యేకతలా?
మళ్లీ నిద్రలేచిన డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ పైత్యం..!
మళ్లీ నిద్రలేచిన డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ పైత్యం..!
ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ర్యాలీలకు నో పర్మిషన్..
ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ర్యాలీలకు నో పర్మిషన్..
ఊయల ఊగడం అంటే పిల్లల ఆట కాదు.. పెద్దలకు ఊహించని ఆరోగ్య లాభాలు
ఊయల ఊగడం అంటే పిల్లల ఆట కాదు.. పెద్దలకు ఊహించని ఆరోగ్య లాభాలు
ఏపీలో విషాదం.. కార్తీక దీపాల కోసం వెళ్లి కానరాని లోకాలకు..
ఏపీలో విషాదం.. కార్తీక దీపాల కోసం వెళ్లి కానరాని లోకాలకు..
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య హ్యాట్రిక్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య హ్యాట్రిక్ హిట్ మూవీ..