AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శోభన్ బాబు సలహా విని భారీగా ఆస్తులు సంపాదించిన టాలీవుడ్ నటుడు.. కానీ చివరి రోజుల్లో నరక యాతన అనుభవించారు

సోగ్గాడు శోభన్ బాబు సలహా విని ఈ టాలీవుడ్ నటుడు కూడా సంపాదించిన ప్రతి పైసాలో సగం భూమి మీదే పెట్టారు. దీంతో భారీగానే ఆస్తులు కూడబెట్టారు. అయితే ఓ మహమ్మారి జబ్బు కారణంగా ఈ నటుడు చివరి రోజుల్లో నరక యాతన అనుభవించారు.

శోభన్ బాబు సలహా విని భారీగా ఆస్తులు సంపాదించిన టాలీవుడ్ నటుడు.. కానీ చివరి రోజుల్లో నరక యాతన అనుభవించారు
Narra Venkateswara Rao
Basha Shek
|

Updated on: Oct 01, 2026 | 8:44 PM

Share

నర్రా వెంకటేశ్వరరావు.. ఇప్పటి తరానికి ఈ టాలీవుడ్ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. 80-90 జనరేషన్స్ కు ఈ యాక్టర్ ను చూస్తే ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంగా ఈ సీనియర్ నటుడి సినిమాలు తరచూ టీవీలో వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా అగ్రహారంలో 1947లో జన్మించారు నర్రా. 37 ఏళ్ల వయసులో అంటే 1974లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సుమారు మూడు దశాబ్దాల పాటు విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు. దాదాపు 500 కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారాయన. ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ, నేటి భారతం, తొలి ప్రేమ, పౌర్ణమి, లక్ష్మీ నరసింహ తదతర సూపర్ హిట్ సినిమాలు నర్రాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కేవలం సినిమాలే కాదు పలు సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువయ్యారు నర్రా. సినిమాల సంగతి పక్కన పెడితే.. సిల్వర్ స్క్రీన్ పై కటువుగా, మొరటుగా కనిపించే నర్రా నిజ జీవితంలో మాత్రం చాలా మృదు స్వభావి. వివాదాలకు ఆమడ దూరంలో ఉన్నారు. ఇక సినిమాలు, టీవీ సీరియల్స్ తో బాగానే సంపాదంచారీ సీనియర్ నటుడు. ముఖ్యంగా సోగ్గాడు శోభన్ బాబు సలహా విని సంపాదించిన ప్రతి పైసాలో సగం భూమి మీదే పెట్టారు. దీంతో రియల్ ఎస్టేట్ లో భారీగా ఆస్తులు కూడ బెట్టారీ సీనియర్ నటుడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్టుగా, వివాదరహితుడుగా, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్వర రావు 2009 డిసెంబర్‌ 27న కన్నుమూశారు. అయితే జీవిత చరమాంకంలో ఆయన చాలా దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్నారట. ఒకానొక దశలో చావును ముందే గ్రహించిన ఆయన చంటి పిల్లాడిలా ఏడ్చేశాడట. ఈ విషయాన్న నర్రా కూతురు వాసంతి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘ నాన్నకు క్యాన్సర్‌ చాలా ఆలస్యంగా బయటపడింది. ఉన్నట్లుండ ఆయన బరువు తగ్గిపోతుంటే షుగర్‌ వల్లేమో అనుకున్నాం.. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తే డాక్టర్లు పెద్ద పేగు క్యాన్సర్‌ ఉందని షాక్ ఇచ్చారు. అది కూడా చివరి స్టేజ్‌ అని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. నాన్నను బతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం. కీమోథెరపీ, సర్జరీలు చేయించారు. అలా కొన్నేళ్ల పాటు నాన్న సంతోషంగా జీవనం సాగంచారు. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా పవిత్ర బంధం అని సీరియల్ లో నాన్న యాక్ట్ చేశారు. కానీ క్యాన్సర్ కారణంగా దాదాపు 25 కిలోల బరువు తగ్గిపోయారు. ఇక చివరి రోజుల్లో ఒంట్లో ఓపిక లేక షూటింగ్‌కు కూడా వెళ్లలేకపోయారు. మనవలు, మనవరాళ్లతో సంతోషంగా గడాపాలని కలల కన్న ఆయన ఆరోగ్యం దెబ్బతినేసరికి బాగా క్రుంగిపోయాడు. ఇంకేమైనా ట్రీట్‌మెంట్‌ ఉందా? కనుక్కున్నారా? అని తరచూ మమ్మల్ని అడిగేవారు. ఇక చావుకు దగ్గరైనప్పుడు మాత్రం నాన్న చిన్నపిల్లాడిలా ఏడ్చారు. ఆయన చాలా ధైర్యవంతుడు. కానీ చివరి రోజుల్లో నాన్ననుఉ అలా చూడలేకపోయాం’ అని నర్రా కూతురు కన్నీళ్లు పెట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..
భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి
భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి
పెరుగు రుచిగా, గడ్డలా రావాలంటే ఇలా చేయండి..
పెరుగు రుచిగా, గడ్డలా రావాలంటే ఇలా చేయండి..
పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు
పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు
ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..
ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..
బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా?
బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా?
డీమార్ట్‌లో బ్యాగ్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు.. ఈ ఒక్క రూల్..
డీమార్ట్‌లో బ్యాగ్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు.. ఈ ఒక్క రూల్..
మీతో మాట్లాడుతున్న వ్యక్తి నిజమే చెబుతున్నాడా? ఇవి గమనించండి
మీతో మాట్లాడుతున్న వ్యక్తి నిజమే చెబుతున్నాడా? ఇవి గమనించండి
పండుగల సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..
పండుగల సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..