AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి

Diveagar Beach Tragedy: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పుణెకు చెందిన ప్రైవేట్ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు దివేగర్‌ బీచ్‌కు పిక్నిక్‌కు వెళ్లారు. సముద్రంలో ఈతకు వెళ్లిన వారిలో 8 మంది గల్లంతై మృతి చెందారు. సముద్ర ప్రవాహాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి
Diveagar Beach Tragedy
Rajashekher G
|

Updated on: Oct 01, 2026 | 10:03 PM

Share

Maharashtra Tragedy: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివేగర్‌ బీచ్‌కు పిక్నిక్‌ కోసం వెళ్లిన విద్యార్థుల్లో ఎనిమిది మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. పుణె జిల్లాలోని ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మొత్తం 48 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు దివేగర్‌ బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు సముద్రంలో ఈతకు వెళ్లారు. అయితే సముద్ర ప్రవాహం ఒక్కసారిగా ప్రమాదకరంగా మారడంతో ఎనిమిది మంది విద్యార్థులు గల్లంతయ్యారు.

తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో పోలీసులు, స్థానికులు వెంటనే రంగంలోకి దిగారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గల్లంతైన ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.

సముద్ర ప్రవాహాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Follow Us
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!