ఏం సీన్లు రా బాబూ.. ఓటీటీలో పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ మూవీ..

Rajitha Chanti

Pic credit - Instagram

22 October 2026

 ప్రస్తుత కాలంలో సినిమా అంటే భారీ యాక్షన్ సీన్లు, హై-వోల్టేజ్ ఛేజింగులు ఉండాలనే ట్రెండ్ నడుస్తోంది. బలమైన కథతో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలు అరుదు.

అలాంటి కోవకే చెందిన ఒక ఫీల్ గుడ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో సైలెంట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దాదాపు మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ, ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా ప్రేక్షకులను పూర్తిగా లీనం చేసే ఈ చిత్రమే 'మెట్రో... ఇన్ డినో'

నాలుగు వేర్వేరు జంటల జీవితాలు, వారి ప్రేమ, బంధాలు, అపార్థాలు , భావోద్వేగాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

ఆధునిక కాలంలో సంబంధాలు ఎంతటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో అత్యంత సహజంగా ఈ చిత్రంలో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న కథాంశం ఆద్యంతం కట్టిపడేస్తాయి.

'మెట్రో... ఇన్ డినో' సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించగా మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, అలీ ఫజల్, కొంకణా సేన్ శర్మ, ఫాతిమా సనా షేక్ తదితరులు నటించారు.

 ఆధునిక నగరాల్లో నివసించే నాలుగు వేర్వేరు జంటల జీవితాలు, వారి ప్రేమ, సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ ఈ ఫీల్-గుడ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సాగుతుంది.