నువ్వు దేవుడివి బాస్.. మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డాక్టర్ శివాంగి జోషి ఇంట్లో వంటగదిలో మంటలు చెలరేగగా, పార్సిల్ ఇచ్చేందుకు వచ్చిన డెలివరీ బాయ్ సమయస్ఫూర్తితో స్పందించాడు. తన పని ముగించుకుని వెళ్లిపోకుండా, ధైర్యంగా మంటలను అదుపు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను శివాంగి సోషల్ మీడియాలో పంచుకుంటూ అతడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో 74 లక్షలకు పైగా వ్యూస్ సాధించగా, నెటిజన్లు డెలివరీ బాయ్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడే నిజమైన మనిషి అంటారు పెద్దలు. కష్టంలో ఉన్నది మనవాడా, పగవాడా అనేది చూడకుండా ఆదుకోవడమే మానవత్వం అనిపించుకుంటుంది. సరిగ్గా అలాంటి పనే చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు ఓ డెలివరీ బోయ్. డాక్టర్ శివాంగి జోషి ఇంటికి ఓ డెలివరీ బాయ్ పార్సిల్ తెచ్చి ఇచ్చాడు. ఆమె గేటు వద్ద పార్సిల్ తీసుకుంటున్న సమయంలోనే, వంటగదిలోని స్టవ్‌పై ఉన్న పాన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి తీవ్రంగా మంటలు చెలరేగాయి. పార్సిల్ తీసుకుని లోపలికి వెళ్లిన శివాంగి ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను ఎలా అదుపు చేయాలో తెలియక తల్లడిల్లిపోయారు. విషయాన్ని గమనించిన ఆ డెలివరీ బాయ్, సాధారణంగా తన పని ముగించుకుని వెళ్లిపోకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేరుగా వంటింట్లోకి దూసుకెళ్లాడు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాసమయస్ఫూర్తితో ఒక వస్త్రాన్ని ఉపయోగించి ధైర్యంగా ఆ మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాడు. ఆ క్షణంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ డెలివరీ బోయ్ చూపిన బాధ్యత, ధైర్యానికి శివాంగి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “కొందరు పార్సిళ్లు ఇస్తే, మరికొందరు జీవితంపై ఆశను ఇస్తారు.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాడు” అంటూ కంటతడి పెట్టించే సందేశంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో నెట్టింట ఏకంగా 74 లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది. హోదాతో సంబంధం లేకుండా సమయానికి స్పందించిన ఆ డెలివరీ బాయ్‌ను రియల్ హీరో అని, అతడి సాహసానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు.. వంటచెయ్యరు.. ఎందుకో తెలుసా?
బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా.. ఏం జరిగిందో మీరే చూడండి
KimJongUn: కిమ్ జోంగ్ ఉన్ ఇక లేరా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా..

