డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా డ్రోన్ అంబులెన్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెన్నై అన్నా యూనివర్సిటీ పరిశోధనా కేంద్రం వెల్లడించింది. సుమారు 250 కిలోల బరువు మోయగల ఈ డ్రోన్ ఇద్దరిని తరలించేలా రూపొందించినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కారైక్కుడి సమీపంలోని కానాడుకాత్తాన్ విమానాశ్రయంలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను వేగంగా తరలించడంతో పాటు మందుల సరఫరాలోనూ ఈ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ వల్ల అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రోగులను వేగంగా ఆస్పత్రికి చేర్చేందుకు ‘డ్రోన్ అంబులెన్స్’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. చెన్నై అన్నా యూనివర్సిటీకి చెందిన ‘డాక్టర్ కలాం అధునాతన మానవరహిత వైమానిక వాహన పరిశోధన కేంద్రం’ ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను రూపొందించింది. వచ్చే ఏడాది జనవరిలో కారైక్కుడిలోని కానాడుకాత్తాన్ విమానాశ్రయంలో దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు ఏరోస్పేస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ సెంథిల్‌కుమార్ వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వ నిధులతో 2019లో ప్రారంభమైన ఈ పరిశోధనా కేంద్రం, 2021లోనే డ్రోన్ పైలట్ శిక్షణ కోసం డీజీసీఏ అనుమతి పొందింది. తాజాగా రూపొందించిన ఈ డ్రోన్ అంబులెన్స్ సుమారు 250 కిలోల బరువును మోయగల సామర్థ్యంతో తయారు చేయబడింది. ఇది ఇద్దరు వ్యక్తులను ఒకేసారి తీసుకెళ్లగలదు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, 1000 నుంచి 1200 అడుగుల ఎత్తులో వరుసగా 90 నిమిషాల పాటు ప్రయాణించగలదు. ఈ డ్రోన్ అంబులెన్స్‌లు భవనాలు, స్టేడియంల పైకప్పుల పై కూడా సులభంగా దిగేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో 400 కిలోమీటర్ల దూరానికి తక్కువ మోతాదులో అవసరమైన మందులను నేరుగా సరఫరా చేసేందుకు కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. విపరీతమైన ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఈ డ్రోన్ సాంకేతికత ముందుకు సాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు.. వంటచెయ్యరు.. ఎందుకో తెలుసా?
బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా.. ఏం జరిగిందో మీరే చూడండి
KimJongUn: కిమ్ జోంగ్ ఉన్ ఇక లేరా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా..
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..

