బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం
బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నవంబర్ 1, 2026న ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రైలు 1,118 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 16 గంటల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. 16 కోచ్‌లు, 823 బెర్త్‌ల సామర్థ్యంతో ఏసీ ఫస్ట్ క్లాస్, టూ టైర్, త్రీ టైర్ సదుపాయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రారంభ తేదీ, సమయాలు, స్టాపులపై అధికారిక రైల్వే ప్రకటనను నిర్ధారించుకోవాలి.
బెంగళూరు, ముంబై నగరాల మధ్య ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే శుభవార్త అందించింది. నవంబర్ 1, 2026న ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రతిష్టాత్మకమైన ‘వందే భారత్ స్లీపర్ ట్రైన్’ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ మార్గంలో ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్రయాణికుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి ముంబై వెళ్లేందుకు ‘ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్’ వంటి రైళ్లు సుమారు 22 నుంచి 24 గంటల సమయం తీసుకుంటున్నాయి. కానీ, ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైలు కేవలం 16 గంటల్లోనే 1,118 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించనుంది. దీనివల్ల ప్రయాణికులకు దాదాపు 6 గంటల విలువైన సమయం ఆదా కానుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. షెడ్యూల్ వివరాల ప్రకారం, ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి రాత్రి 7:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు ముంబై CSMT చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబైలో రాత్రి 8:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ మార్గంలో అనంతపురం, గుంతకల్లు, రాయచూరు, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉండనున్నాయి. ఇందులో ఏసీ త్రీ-టైర్, ఏసీ టూ-టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ విభాగాలు అందుబాటులో ఉంటాయి. మొత్తం 823 బెర్త్‌ల సామర్థ్యం కలిగిన ఈ అత్యాధునిక స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే, రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే వ్యాపారవేత్తలు, ఉద్యోగులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా.. ఏం జరిగిందో మీరే చూడండి
KimJongUn: కిమ్ జోంగ్ ఉన్ ఇక లేరా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా..
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు

