డబ్బుల్లేవని వైద్యం ఆపకండి.. హాస్పిటల్ బిల్లులకూ ఈఎంఐ ఆప్షన్.. అసలు నిజమిదే!
ఆరోగ్య బీమా లేక ఆర్థిక ఇబ్బందులతో చికిత్సను వాయిదా వేసుకుంటున్నారా? హాస్పిటల్ బిల్లులను ఈఎంఐలుగా చెల్లించే సౌకర్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అధిక వడ్డీలు, ప్రాసెసింగ్ ఫీజులు, దాచిన ఛార్జీలు వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య బీమాకు ఇది ప్రత్యామ్నాయం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, లక్షల్లో వచ్చే ఆసుపత్రి బిల్లులు సాధారణ ప్రజలకు పెద్ద భారాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య బీమా లేకపోతే, అప్పటికప్పుడు డబ్బులు సర్దుబాటు చేయడం కష్టంగా మారి, చికిత్సను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇటీవల మెడికల్ ఫైనాన్సింగ్ లేదా మెడికల్ ఈఎంఐ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా పెద్ద ఆసుపత్రి బిల్లులను నెలవారీ వాయిదాలుగా చెల్లించే అవకాశం లభిస్తుంది. భారతదేశంలో మొత్తం ఆరోగ్య ఖర్చుల్లో దాదాపు 39% ప్రజలు తమ సొంత డబ్బుల నుంచే భరిస్తున్నారు. పది మంది రోగుల్లో ఆరుగురు సరైన సమయంలో డబ్బులు లేక చికిత్సను వాయిదా వేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. మెడికల్ ఈఎంఐ ఈ తక్షణ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అయితే, ఆర్థిక నిపుణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈఎంఐలు సులభంగా అనిపించినా, అధిక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, పెనాల్టీలు మరియు హిడెన్ ఛార్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జీరో కాస్ట్ ఈఎంఐ అని చెప్పినా, నగదు చెల్లింపులపై లభించే డిస్కౌంట్లను కోల్పోతుందేమో సరిచూసుకోవాలి. ఈఎంఐ కేవలం తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, ఆరోగ్య బీమాకు ఇది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పశువుల్లో వింత వ్యాధి.. ఆందోళనలో జనం
దీపికా-రణ్‌వీర్ రెండో కూతురి పేరేంటో తెలుసా?
నువ్వు దేవుడివి బాస్.. మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు.. వంటచెయ్యరు.. ఎందుకో తెలుసా?
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!

