దీపికా-రణ్‌వీర్ రెండో కూతురి పేరేంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ రెండో కుమార్తె పేరును దసరా సందర్భంగా వెల్లడించారు. చిన్నారికి ‘దేవి పదుకొణె సింగ్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పటికే వీరికి ‘దువా’ అనే కుమార్తె ఉన్నారు. రెండో కూతురి పేరును తెలుసుకున్న అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత కాలంలో పిల్లలకు వింత వింత పేర్లు పెట్టడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ఒకప్పటిలా అందమైన, సాంప్రదాయ దేవుళ్ల పేర్లు పెట్టడం జనాలు చాలా వరకు తగ్గించేశారు. కానీ, బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్ దంపతులు మాత్రం తమ రెండో కూతురికి ఎంతో పవిత్రమైన పేరును ఎంచుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ సంతోషకరమైన విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు రెండేళ్ల క్రితం తొలి సంతానంగా కూతురు జన్మించింది. ఆమెకు ‘దువా’ అని పేరు పెట్టారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబరు 19న దీపికా దంపతులకు రెండో కూతురు జన్మించింది. దసరా శుభసమయంలో ఆ చిన్నారికి ‘దేవి పదుకొణె సింగ్’ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఈ పోస్టు చూసిన అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘ధురంధర్’ రెండు భాగాల సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం ‘ప్రళయ్’ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. మరోవైపు దీపికా పదుకొణె కూడా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన ‘కింగ్’ చిత్రంలోనూ, తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘రాకా’ సినిమాలోనూ నటిస్తూ అలరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నువ్వు దేవుడివి బాస్.. మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు.. వంటచెయ్యరు.. ఎందుకో తెలుసా?
బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా.. ఏం జరిగిందో మీరే చూడండి
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా..
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!

