AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశువుల్లో వింత వ్యాధి.. ఆందోళనలో జనం

పశువుల్లో వింత వ్యాధి.. ఆందోళనలో జనం

Phani CH
|

Updated on: Oct 22, 2026 | 7:25 PM

Share

తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో రోడ్లపై సంచరిస్తున్న ఆవులు, గేదెలకు చర్మంపై పెద్ద బొబ్బలు, పుండ్లు ఏర్పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లక్షణాలను బట్టి లంపీ స్కిన్‌ వ్యాధి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, వ్యాధి నిర్ధారణ కావాల్సి ఉంది. పశువులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని పశుప్రేమికులు కోరుతున్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం, పశువైద్యశాఖ అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంచరిస్తున్న ఆవులు, గేదెలు వింత వ్యాధి బారిన పడుతున్నాయి. రామ్ మందిర్, స్టేషన్ రోడ్, వీక్లీ మార్కెట్ రోడ్లతో పాటు పట్టణంలోని ప్రధాన వీధుల్లో రోజువారీగా వందలాది పశువులు రోడ్లపై సంచరిస్తుంటాయి. అయితే, వాటిలో కొన్ని పశువులకు సోకిన అనారోగ్య సమస్య తీవ్రరూపం దాల్చుతుండటంతో పశుప్రేమికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వింత వ్యాధి సోకిన మూగజీవాలు తీవ్ర నరకం అనుభవిస్తున్నాయి. పశువుల శరీరాలపై పెద్ద పెద్ద బొబ్బలు, పుండ్లు ఏర్పడుతుండటంతో అవి సరిగ్గా మేత మేయలేకపోతున్నాయి. అంతేకాకుండా, నడవడానికి కూడా తీవ్రంగా అవస్థలు పడుతూ రోడ్లపైనే కుదేలవుతున్నాయి. లక్షణాలను బట్టి చూస్తే ఇది ప్రాణాంతకమైన ‘లంపీ స్కిన్’ వ్యాధి అయి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పట్టణంలో రోడ్లపై తిరిగే జీవాలకు ఈ వ్యాధి సోకడంతో ఇతర ఆరోగ్యకరమైన పశువులకు కూడా ఇది వేగంగా సోకే ప్రమాదం ఉంది. వైరస్ మరింత వ్యాప్తి చెందక ముందే అప్రమత్తం కావాలని ప్రజలు కోరుతున్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం, వెటర్నరీ బృందాలు స్పందించి రంగంలోకి దిగాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులైన పశువులకు తక్షణమే ప్రత్యేక వైద్య చికిత్స అందించాలని, నివారణ చర్యలు చేపట్టి మూగజీవాల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపికా-రణ్‌వీర్‌ రెండో కూతురి పేరేంటో తెలుసా?

నువ్వు దేవుడివి బాస్‌.. మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్‌

డ్రోన్‌ అంబులెన్స్‌‌లు వచ్చేస్తున్నాయ్‌

ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు.. వంటచెయ్యరు.. ఎందుకో తెలుసా?

బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం

Follow Us