AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో గ్యాస్ త్వరగా అయిపోతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే మరో 15రోజులు రావడం పక్కా..

నెల తిరక్కుండానే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోతుందా..? పెరిగిన సిలిండర్ ధరలు మీ వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయా? అయితే మీరు వెంటనే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే.. మనం రోజూ కిచెన్‌లో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే సగం గ్యాస్ వృథాగా పోతుంది. వంటింట్లో ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు.. మీ గ్యాస్ సిలిండర్ మరో 10 నుంచి 15 రోజులు అదనంగా పనిచేస్తుంది. ఆ సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Oct 22, 2026 | 7:32 PM

Share
గ్యాస్ వెలిగించే ముందే ప్రిపరేషన్ పూర్తి చేయండి: చాలామంది చేసే ప్రధాన పొరపాటు.. స్టవ్ వెలిగించి బాణలి పెట్టిన తర్వాత కూరగాయలు తరగడం, మసాలాలు వెతకడం, నీళ్లు తేవడం చేస్తుంటారు. దీనివల్ల నిమిషాల కొద్దీ మంట వృథాగా మండుతుంది. అందుకే వంట మొదలుపెట్టే ముందే కూరగాయల ముక్కలు, ఉప్పు, కారం, మసాలా పేస్ట్‌లు వంటి అవసరమైనవన్నీ చేతికి అందేలా సిద్ధంగా ఉంచుకోవాలి. దీనివల్ల వంట త్వరగా పూర్తి కావడమే కాకుండా గ్యాస్ వినియోగం బాగా తగ్గుతుంది.

1 / 5
పాత్ర పరిమాణం - సరైన బర్నర్ ఎంపిక: పెద్ద బర్నర్‌పై చిన్న గిన్నెను పెడితే మంట గిన్నె అంచుల దాటి బయటకు వెళ్లిపోతుంది తప్ప వేడి పూర్తిగా వంటకు ఉపయోగపడదు. పాత్ర పరిమాణానికి తగిన బర్నర్‌ను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే అడుగుభాగం చదునుగా ఉండే పాత్రలను వాడటం, వండేటప్పుడు తప్పనిసరిగా మూతలు పెట్టడం వల్ల లోపల ఆవిరి నిలిచి ఆహారం రెట్టింపు వేగంతో ఉడుకుతుంది.

2 / 5
ప్రెషర్ కుక్కర్ వాడకం పెంచండి:  సాధారణ గిన్నెలు లేదా బాణలిలో పప్పులు, అన్నం, బంగాళదుంపలు లేదా మాంసాహారం ఉడికించాలంటే ఎక్కువ సమయం, విపరీతమైన గ్యాస్ ఖర్చవుతుంది. వీటికి ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగిస్తే లోపలి ఆవిరి పీడనంతో తక్కువ సమయంలోనే ఆహారం మెత్తగా ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఆదా చేస్తుంది.

3 / 5
కూరలు లేదా నీళ్లు మరగడం మొదలైన వెంటనే మంటను హై ఫ్లేమ్ నుంచి మీడియం లేదా సిమ్‌కి మార్చాలి. అధిక మంటపై వండితే ఆహారం మాడిపోవడమే తప్ప పోషకాలు నశించి గ్యాస్ వృథా అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్రిజ్ నుంచి తీసిన పాలు, కూరలు, పిండిని నేరుగా స్టవ్‌పై పెట్టకూడదు. వాటిని ముందుగానే బయటకు తీసి, సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మాత్రమే వేడి చేయాలి.

4 / 5
స్టవ్ బర్నర్ రంధ్రాలలో నూనె, జిడ్డు, ఆహార వ్యర్థాలు పేరుకుపోతే గ్యాస్ సరిగ్గా మండక ఎరుపు లేదా పసుపు రంగు మంట వస్తుంది. ఇది గ్యాస్ భారీగా వృథా అవుతోందనడానికి సంకేతం. ఎల్లప్పుడూ బర్నర్ నుంచి స్పష్టమైన నీలి రంగు మంట వచ్చేలా వారానికి ఒకసారి బర్నర్లను శుభ్రం చేయాలి. దీంతో పాటు గ్యాస్ పైపు, రెగ్యులేటర్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ లీకేజీలు లేకుండా చూసుకోవడం వల్ల పొదుపుతో పాటు ప్రాణ రక్షణ కూడా లభిస్తుంది.

5 / 5
Follow Us