AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: నిద్రలో నడిచే అలవాటుతో మర్డర్ కేసులో ఇరుక్కునే హీరో.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్

సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించాడు. అలాగే 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ మరో ప్రధాన పాత్ర పోషించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం ఇవాళే (అక్టోబర్ 22) ఓటీటీలోకి వచ్చింది.

OTT Movie: నిద్రలో నడిచే అలవాటుతో మర్డర్ కేసులో ఇరుక్కునే హీరో.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్
Ott Movie (2)
Basha Shek
|

Updated on: Oct 22, 2026 | 7:23 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి. రీసెంట్ హిట్స్ నాని ‘ప్యారడైజ్’, కీర్తి సురేశ్ ‘డోరతి’తోపాటు సుమో దీదీ లాంటి చిత్రాలతో పాటు నా వైఫ్ మిస్సింగ్, వరం లాంటి తెలుగు సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటిలో నాని ది ప్యారడైజ్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే దీంతో పాటు గురువారం (అక్టోబర్ 22)అర్ధరాత్రి నుంచే మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ నటుడు సునీల్ ఇందులో చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించారు. అలాగే రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ మరో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మహాకు (అఖిల్) ఆర్టిస్ట్ కావాలనేది కోరిక. హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని తల్లికి చెప్పి తన లక్ష్యం కోసం సిటీకి వస్తాడు. అక్కడ పోలీస్ శాఖలో స్కెచ్ ఆర్టిస్ట్‌గా పనికి చేరుతాడు. వర్క్ లో భాగంగా ఎందరో క్రిమినల్స్ స్కెచ్ వేసి ఎన్నో కీలక కేసులను సాల్వ్ చేస్తాడు. అయితే మహాకు స్లీపింగ్ డిజార్డర్ అనే సమస్య ఉంటుంది. నిద్రలో భయంకరమైన కలలు వస్తుంటాయి. తనకు తెలియకుండానే నిద్రలో నడుస్తుంటాడు. తన బాల్యం, చనిపోయిన తండ్రి (సునీల్) కలలో కనిపిస్తారు.

ఈ క్రమంలోనే నిద్రలో నడక వల్ల ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు మహా. మరి అసలు ఆ హత్య చేసింది ఎవరు? మహాకు చనిపోయిన మహిళకు సంబంధం ఏంటి? ఎందుకు మహాను ఈ కేసులో ఇరికించారు? చివరకు మహా ఎలా భయటపడ్డాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ఈ సినిమాపేరు ‘ఫైట్ మహా’ (Fight Maha). రామ్‌గోపాల్ వర్మ నిర్మాణంలో సంచలనం సృష్టించిన ‘మర్డర్’ చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సునీల్, అఖిల్‌లతో పాటు డాక్టర్ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్. కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించారు. ప్రస్తుతం ఫైట్ మహా సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

‘ఫైట్ మహా’ సినిమా ట్రైలర్

..</h3>

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us