ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా ఎంపికైంది. మాలీవుడ్ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
'శ్రీ గోకులం మూవీస్' పతాకంపై అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంచలనాత్మక ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
గ్రాండ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై భాగ్యశ్రీ బోర్స్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. మోహన్‌లాల్‌తో సెట్స్‌లో ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ..
"మోహన్‌లాల్ సర్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన కళ్లలోనే ఎంతో ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది" అంటూ రాసుకొచ్చారు.