ఎంత బక్కగా ఉన్నా సరే.. ఈ సూప్ తాగితే లావుగా అవ్వడం ఖాయం
Samatha
31 July 2026
బరువు పెరగాలి అని ఎవరు అనుకోరు చెప్పండి. చాలా మంది త్వరగా బరువు పెరగాలి అనుకుంటారు.
అయితే బరువు పెరగాలి అనుకునేవారు ప్రతి రోజూ ఒక సూప్ తాగితే సరిపోతుందంట. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా?
స్వీట్ పొటాటో, పప్పుల సూప్. ఇది తాగడానికి అంతగా ఇష్టపడరు కానీ ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగడం వలన ఇందులో ఉన్న ప్రోటీన్ చాలా త్వరగా బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఇక ఈ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల విషయంలోకి వెళితే.. చిలకడ దుంపలు, కందిపప్పు, నెయ్యి, ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, పాలు, మిరియాల పొడి, ఉప్పు.
దీని కోసం ముందుగా కుక్కర్‌లో నెయ్యి వేసి, ఉల్లి ముక్కలు, చిలకడదుంపలు, పప్పు, నీళ్లు అన్నీ వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
ఇది బాగా ఉడికిన తర్వాత దీనిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు కలపాలి, దీనిలో మిరియాల పొడి,ర ఉప్పు వేసి మరిగించుకోవాలి.
ఇలా చేసుకొని ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగడం వలన చాలా సులభంగా బరువు పెరగవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
అందుకే, బరువు పెరగాలి అనుకునే వారు తప్పకుండా ప్రతి రోజూ ఒక గ్లాస్ ఈ సూప్ తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.