AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

రూ. 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, రూ. 400 కోట్ల వసూళ్లను సాధించి మంచి ఆదరణ పొందింది. ఇప్పటికీ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఈ మూవీలోని ప్రతి సీన్, ప్రతి సాంగ్ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఎలాంటి గ్లామర్ షో, సాంగ్స్ లేకుండానే యావత్ బాక్సాఫీస్ షేక్ చేసింది ఈ మూవీ.

Rajitha Chanti
|

Updated on: Jul 31, 2026 | 11:22 PM

Share
కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు పెద్దగా జనాల దృష్టిని ఆకర్షించవు. కానీ రోజులు గడిచేకొద్దీ, ఆ సినిమానే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు ఆ తర్వాత కలెక్షన్ల సునామీ సష్టించాయి. అంతేకాదు యావత్ భారతదేశం మొత్తం ఈ మూవీ గురించి మాట్లాడుకున్నారు. కేవలం రూ.16 కోట్లతో తీసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో  ఏకంగా రూ.400 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకీ మనం ఇంతగా మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5
అదే కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి కథానాయకుడిగా, సప్తమి గౌడ కథానాయికగా నటించారు. కిషోర్ ఒక పోలీస్ అధికారి పాత్రను పోషించారు. ఈ చిత్రం తీరప్రాంత కర్ణాటక యొక్క పవిత్ర మరియు ఆధ్యాత్మిక సంప్రదాయమైన భూత కోలాను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే వైరుధ్యాలతో కూడిన పంజర్లి దేవత కథ ఆధారంగా విడుదలైన ఈ చిత్రంపై మొదట్లో కన్నడలో పెద్దగా అంచనాలు లేవు.

2 / 5
ఈ చిత్రం విడుదలై అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకుంది. కన్నడ భాషలో ఈ చిత్రాన్ని చూసిన ఇతర రాష్ట్రాల అభిమానులు కూడా క్లైమాక్స్‌కు ముగ్ధులయ్యారు. ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఆ తర్వాత, ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వరకు వసూలు చేసి భారతదేశంలో విజయవంతమైంది. కర్ణాటకలోని గిరిజన వర్గాల సాంప్రదాయ ఆచారాలు, నమ్మకాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని కన్నడ చిత్రసీమలో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది.

3 / 5
ఈ విజయం తర్వాత, ఈ చిత్ర రెండవ భాగం గతేడాది అక్టోబర్‌లో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం రూ. 800 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కర్ణాటకలోని తుళునాడు సంస్కృతి, 'భూత కోల' సంప్రదాయం , మానవునికి-ప్రకృతికి నడుమ ఉండే బంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. క్లైమాక్స్ సన్నివేశంలో రిషబ్ శెట్టి కనబరిచిన నటన, అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులచేత నీరాజనాలు అందుకున్నాయి.

4 / 5
ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే భారతదేశంలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ విడుదలైన తర్వాత నాన్-ఇంగ్లీష్ గ్లోబల్ టాప్-10 సినిమాల జాబితాలో వరుసగా 4 వారాలకు పైగా ట్రెండ్ అయింది. ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, విడుదలైన తొలి రోజే అత్యధిక డిజిటల్ వ్యూస్ సాధించి అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

5 / 5
Follow Us