రేణుకా స్వామి హత్య కేసులో జైలులో ఉన్న నటి పవిత్ర గౌడ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమె, జైలులో నైజీరియన్ ఖైదీల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కోర్టుకు వివరించారు. బెయిల్ ఇవ్వకుంటే విషమైనా ఇప్పించాలని కోరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.