యేషనాగుల పాటకు థియేటర్లు షేక్.. కీర్తి రెమ్యునరేషన్ ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
23 September 2026
ఎట్టకేలకు ది ప్యారడైజ్ మూవీ విడుదలైంది. నిన్న రాత్రి నుంచి ప్రీమియర్స్ పడగా ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇందులో నాని హీరోగా నటించారు.
ఇందులో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ మూనీలో యేషనాగుల పాటలో నటించింది కీర్తి.
గతంలో నానితో కలిసి ‘నేను శైలజ’, ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కీర్తి, ఈసారి మాస్ స్టెప్పులతో థియేటర్లలో జోష్ నింపారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన ఉర్రూతలూగించే స్వరాలకు కీర్తి, నాని వేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే మొగ్గుచూపే కీర్తి సురేశ్, కెరీర్‌లో మొదటిసారిగా ఇలాంటి స్పెషల్ డాన్స్ నంబర్ ఒప్పుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఈ ఒక్క పాట కోసం చిత్ర నిర్మాతలు ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం చెల్లించినట్లు టాక్. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ పాటకు కీర్తి కోటి చెల్లించారట.
ఈ పాటలో నటించినందుకు గాను కీర్తి సురేశ్‌కు సుమారు రూ. 1 కోటి పారితోషికం అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.
మరోవైపు థియేటర్రలో యేషనాగుల సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్, కీర్తి, నాని ఊర మాస్ స్టెప్పులతో జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.