Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే ప్రాంతాల్లో అంటే..
Hyderabad Traffic: నగరంలో వినాయకుల నిమజ్జనం సందర్భంగా భారీ వాహనాలపై నిషేధం విధించారు పోలీసులు. భారీ వాణిజ్య వాహనాలు, లారీలు నగరంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రైవేట్ డిస్ట్రిక్ట్ బస్సులుసెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల వరకు బయటి రింగ్ రోడ్ల ద్వారానే నడపాలని..

Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే నగర నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు సమీపంలోని ఇతర ప్రదేశాలకు వస్తున్నాయి. పోలీసులు భారీ భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు పోలీసులు. హైదరాబాద్ నిమజ్జనోత్సవంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర అత్యంత కీలకమైనది. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది.
ప్రధాన శోభాయాత్ర రూట్:
బాలాపూర్ – చంద్రాయణగుట్ట వంతెన – ఫలక్‌నుమా – అలియాబాద్ – చార్మినార్ – మదీనా జంక్షన్ – అఫ్జల్‌గంజ్ – మహారాజాగంజ్ – అబిడ్స్ – బషీర్‌బాగ్ – లిబర్టీ – ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్డు). ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ఖైరతాబాద్ రాజ్‌దూత్ చౌరస్తా -టెలిఫోన్ భవన్ – ఇక్బాల్‌మినార్ చౌరస్తా – తెలంగాణతల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటుంది.
సాధారణ వాహనదారులు:
సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, తార్నాక, టోలిచౌకి, ఎర్రగడ్డ, ఆసిఫ్‌నగర్, రాంనాథ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు నిర్ణీత కనెక్టింగ్ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపు శోభాయాత్రలో కలుస్తాయి. ప్రధాన ఊరేగింపు సాగే రహదారుల్లో కేవలం వినాయక విగ్రహాలు వేళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
సాధారణ వాహనాలకు బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద క్రాసింగ్:
నగరంలో తూర్పు-పడమర దిశల మధ్య ప్రయాణించే సాధారణ వాహనాల కోసం బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద మాత్రమే క్రాసింగ్‌కు పోలీసు శాఖ అవకాశం కల్పించింది. సాధారణ నగర ప్రయాణికులు ఇన్నర్ రింగ్ రోడ్డు, మసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ లేదా ఔటర్ రింగ్ రోడ్డు వినియోగించాలి.
భారీ వాహనాలపై నిషేధం:
నగరంలో వినాయకుల నిమజ్జనం సందర్భంగా భారీ వాహనాలపై నిషేధం విధించారు పోలీసులు. భారీ వాణిజ్య వాహనాలు, లారీలు నగరంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రైవేట్ డిస్ట్రిక్ట్ బస్సులుసెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల వరకు బయటి రింగ్ రోడ్ల ద్వారానే నడపాలని పోలీసులు సూచించారు. ఇక ఎంజీబీఎస్‌కి వెళ్లే ఆర్టీసీ బస్సులు పోలీసు ప్రత్యేక డైవర్షన్ మార్గాల ద్వారా బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




