AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫోన్‌కు స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ అక్కర్లేదు!ఎందుకంటే..

ఐఫోన్‌కు స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ అక్కర్లేదు!ఎందుకంటే..

Phani CH
|

Updated on: Sep 24, 2026 | 10:18 PM

Share

కొత్త ఐఫోన్‌ కొనగానే టెంపర్డ్‌ గ్లాస్‌ వేయించడం సాధారణమే. అయితే ఐఫోన్‌ స్క్రీన్‌పై ప్రొటెక్టర్‌ వాడటం తనకు నచ్చదని యాపిల్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టామ్‌ మారీబ్‌ వ్యాఖ్యానించారు. కొత్త సిరామిక్‌ షీల్డ్‌ 2 గత తరం కంటే గీతలను తట్టుకునే సామర్థ్యం మెరుగుపడిందని తెలిపారు. అయినప్పటికీ ప్రమాదవశాత్తు ఫోన్‌ పడితే డిస్‌ప్లే దెబ్బతినే అవకాశం ఉండటంతో రక్షణ కోసం నాణ్యమైన ప్రొటెక్టర్‌ వాడటం ఉపయోగకరంగా ఉండొచ్చు.

కొత్త ఐఫోన్ కొని ఇంటికి రాగానే మనమందరం చేసే మొదటి పని.. వెంటనే దానికి ఒక బ్యాక్ కవర్, స్క్రీన్‌పై మంచి టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్ వేయించడం! లక్షల రూపాయలు పెట్టి కొన్న ఫోన్.. కిందపడితే డిస్‌ప్లే పగిలిపోతుందేమోనన్న భయంతో ఇలా చేస్తాం. అయితే ఐఫోన్‌కు స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ వాడటం అసలు తనకు ఇష్టం ఉండదని, అలా పెడితే అసహనంగా అనిపిస్తుందని యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మారీబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాపిల్ తమ ఐఫోన్ డిస్‌ప్లేల కోసం ‘సిరామిక్ షీల్డ్ 2’ టెక్నాలజీని ఉపయోగిస్తోందని, ఇది గీతలను తట్టుకోవడంలో గత తరం కంటే మూడు రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉందని మారీబ్ తెలిపారు. మార్కెట్లోని ఇతర స్మార్ట్‌ఫోన్ గ్లాస్‌ల కంటే ఇది ఎంతో మన్నికైనదని ఆయన స్పష్టం చేశారు. ఐఫోన్ డిస్‌ప్లే నాణ్యతను పరీక్షించేందుకు నిరంతరం వాడటం, గీతలు పడటం వంటి పరిస్థితులను క్రియేట్ చేసి.. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఐదేళ్ల వాడకానికి సంబంధించిన టెస్టింగ్ పూర్తి చేస్తామని వెల్లడించారు. అయితే కంపెనీ బాస్ వ్యక్తిగత అభిప్రాయం చెప్పినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. ఫోన్ ప్రమాదవశాత్తు తీవ్రంగా కిందపడితే డిస్‌ప్లే దెబ్బతినే అవకాశం ఎలాగూ ఉంటుంది. కాకపోతే నాణ్యత లేని, తక్కువ ధర టెంపర్డ్ గ్లాస్‌లు వాడితే ఐఫోన్ అసలైన డిస్‌ప్లే క్వాలిటీ, టచ్ రెస్పాన్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేవారికి కేంద్రం హెచ్చరిక!

స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు

మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్‌.. హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన

విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే

Follow Us