AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్‌.. హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన

మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్‌.. హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన

Phani CH
|

Updated on: Sep 24, 2026 | 10:11 PM

Share

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఓ యువతి మెడలో భారీ కొండచిలువను వేసుకుని రోడ్డుపై నృత్యం చేయడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న GHSPCA వన్యప్రాణి రక్షణ బృందం అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా స్వాధీనం చేసుకుంది. ఇది ఇండియన్‌ రాక్‌ పైథాన్‌ అని గుర్తించారు. వన్యప్రాణులను వినోదం కోసం ప్రదర్శించడం చట్టపరమైన సమస్యలకు దారితీయొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వన్యప్రాణుల భద్రతపై ఈ ఘటన చర్చకు తెరలేపింది.

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపులో ఓ ఊహించని వింత దృశ్యం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్ (మధురానగర్ పిఎస్ పరిధి)లో విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో, ఓ యువతి ఏకంగా మెడలో భారీ కొండచిలువను వేసుకుని రోడ్డుపైనే స్టెప్పులు వేసింది. ఈ విన్యాసాన్ని చూసేందుకు జనం ఒక్కసారిగా గుమిగూడారు. అయితే, ఈ వినోదం వెనుక అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ యువతి చేతిలోనిది అత్యంత అరుదైన, అంతరించిపోతున్న ‘ఇండియన్ రాక్ పైథాన్’ (Python molurus) అని తేలడంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న GHSPCA వన్యప్రాణి రక్షణ బృందం వెంటనే అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా స్వాధీనం చేసుకుంది. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 (షెడ్యూల్-I) ప్రకారం ఇండియన్ రాక్ పైథాన్‌కు అత్యున్నత స్థాయి రక్షణ ఉంది. పాములను వినోదం కోసం వాడటం, ప్రదర్శించడం, హింసించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో వన్యప్రాణుల రక్షణపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే

కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే

Gold Price: బంగారం ధరలకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.1,520 పతనం

Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?

స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు

Follow Us