AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే

కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే

Phani CH
|

Updated on: Sep 24, 2026 | 10:01 PM

Share

రాజమహేంద్రవరంలో ఓ వ్యాపారవేత్త కారులో ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు సంచులతో డ్రైవర్‌ కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపింది. దానవాయిపేటలోని జిమ్‌ వద్ద కారును ఉంచి యజమాని లోపలికి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి డ్రైవర్‌, నగదు సంచులు కనిపించలేదు. యజమాని ఫిర్యాదుతో వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగుల బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌, నగదు భద్రతపై ఈ ఘటన చర్చకు తెరలేపింది.

సమాజంలో మానవ సంబంధాలు, నమ్మకాలు ఏ స్థాయిలో క్షీణిస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. ప్రతిరోజూ మన ఇళ్లలో, వ్యాపారాల్లో నమ్మకస్తులుగా మెలిగే డ్రైవర్లు, పనివాళ్లు, ఇతర సిబ్బందిని ఎంతో నమ్మకంతో పనిలో పెట్టుకుంటాం. కొందరిని ఇంటి సభ్యుల్లా భావించి, పూర్తి బాధ్యతలను వారికి అప్పగిస్తాం. అదే ఇప్పుడు యజమానుల పాలిట శాపంగా మారుతోందా అనిపిస్తోంది. నమ్మి పనిలో పెట్టుకున్నవారే యజమానుల ఒంటిపై బంగారం కోసమో.. ఇంట్లోని డబ్బు కోసమో మాటువేసి మట్టుబెట్టిన ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా రాజమహేంద్రవరంలో ఓ యజమానిని కారు డ్రైవర్‌ నిలువునా ముంచేసిన ఘటన కలవరపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చోటుచేసుకున్న ఈ సంచలన ఘటన స్థానిక వ్యాపార వర్గాలతో పాటు సామాన్య ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్యనగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కందుల సురేష్‌కుమార్‌ ‘శేషిక బయోటెక్’ అనే వ్యాపార పరిశ్రమను నిర్వహిస్తున్నారు. తన కంపెనీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆయన తరచూ నగదు బదిలీలు చేస్తుంటారు. సోమవారం ఉదయం తన బిజినెస్ నిమిత్తం సుమారు రెండు కోట్ల రూపాయల నగదును వేర్వేరు ఖాతాల్లో జమచేయడం లేదా ఇతరులకు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు పెద్ద సంచుల్లో ఆ భారీ మొత్తాన్ని భద్రపరిచి, తన కారులో ఉంచారు. ఈ విషయం తన వద్ద డ్రైవర్‌గా పనిచేసున్న ధవళేశ్వరం ప్రాంతానికి చెందిన పండూరి సాయిశివకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ఉదయం జిమ్ పూర్తయిన తర్వాత నగదును అవసరమైన చోటుకు తరలించాల్సి ఉంటుందని సిద్ధంగా ఉండమని చెప్పారు. అనుకున్నట్టుగానే ఉదయం 7:40 గంటల ప్రాంతంలో దానవాయిపేటలోని ఓ జిమ్‌ వద్దకు చేరుకున్నారు. కారును జిమ్ బయటే రోడ్డు పక్కన పార్క్ చేయించి, డ్రైవర్‌ను అక్కడే ఉండమని చెప్పి, సురేష్‌కుమార్‌ వ్యాయామం చేయడానికి లోపలికి వెళ్లారు. సరిగ్గా గంట వ్యవధిలోనే అంటే 8 గంటల 40 నిమిషాల సమయంలో యజమాని జిమ్ నుంచి బయటకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. కారు బయటే ఉంది కానీ, కారులో ఉండాల్సిన డ్రైవర్ డ్రైవరూ లేడు.. కారులో భద్రపరిచిన డబ్బు సంచులు లేవు.. అనుమానం వచ్చి డ్రైవర్‌కి ఫోన్‌ చేశారు సురేష్‌ కుమార్‌. నో రెస్పాన్స్‌… దీంతో షాకైన సురేష్‌ కుమార్‌ స్థానిక వన్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఒక్క ఘటనే కాదు.. మనం నిత్యం పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉంటాం. కొన్నేళ్లుగా మన వద్ద నమ్మకంగా పనిచేస్తున్నారని గుడ్డిగా నమ్మడమే మనం చేసే అతిపెద్ద పొరపాటు. “అబ్బే! వాడు మనోడేనండీ, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాడు” అని సరిపెట్టుకోవడం ఎంతటి ప్రమాదకరమో ఈ సంఘటన తెలియజేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ, విలాసవంతమైన జీవితం గడపాలనే కోరిక, లేదా అప్పుల ఊబిలో కూరుకుపోవడంలాంటి కారణాల వల్ల చాలామంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. భారీ మొత్తంలో డబ్బు తమ కంటిముందు కనిపించగానే ఎంతటి నిజాయితీ గల వ్యక్తి అయినా క్షణాల్లో మనసు మార్చుకునే అవకాశాలు ఉంటాయని సైకాలజిస్టులు, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రైవర్లు, ఇంట్లో పనివారిని విషయంలో చాలామంది చేసే పొరపాట్లు ఎంటో తెలుసా… వారి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకపోవడం. ఎవరినైనా పనిలో చేర్చుకునే ముందు వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, వారి ఊరు, పాత యజమానుల వివరాలు సేకరించకపోవడం. మన వద్ద పనిచేసే డ్రైవర్ లేదా పనిమనిషి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయకపోవడం. ఇంట్లో కట్టల కొద్దీ డబ్బు, లేదా కారులో కోట్ల రూపాయలు ఉన్నప్పుడు వారి ముందే ఆ విషయాలు మాట్లాడటం… వారి ముందే భద్రపరచడం ద్వారా వారికి దురాశ కలిగేలా చేయడం. “మన వద్ద పదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు కదా, ఏమీ చేయడు” అని అతిగా నమ్మి.. తాళాలు, లాకర్ కోడ్లు.. పెద్ద మొత్తంలో నగదును వారి పర్యవేక్షణకు వదిలేయడం. అందుకే ఇలాంటి పొరపాట్లు జరక్కుండా ఉండాలంటే.. ఇంట్లో లేదా వ్యాపారంలో ఎవరిని పనిలో పెట్టుకున్నా.. ముందుగా పోలీసు వెరిఫికేషన్ ఫారమ్ నింపి, వారి ఫోటో, వేలిముద్రలు, పూర్తి చిరునామాను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి. దీనివల్ల వారు ఎలాంటి తప్పు చేయాలన్నా భయపడతారు. పెద్ద మొత్తాలను తరలించేటప్పుడు జాగ్రత్త: వ్యాపార రీత్యా పెద్ద మొత్తంలో నగదును తరలించేటప్పుడు ఒక్క డ్రైవర్‌పైనే ఆధారపడకూడదు. సెక్యూరిటీ సిబ్బందిని లేదా నమ్మకమైన ముఖ్య అధికారులను వెంట ఉంచుకోవాలి. వాహనాల్లో ఎప్పుడూ జీపీఎస్ ట్రాకర్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే కారు లేదా ఆఫీసు పరిసరాల్లో సిసిటీవి కెమెరాల కన్ను ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. డబ్బు లావాదేవీలు లేదా బ్యాంక్ డిపాజిట్ల వివరాలను డ్రైవర్లు లేదా ఇంటి పనివారికి ముందుగా వెల్లడించకూడదు. కారు సీటు కింద లేదా డిక్కీలో సొమ్ము ఉంచి, డ్రైవర్‌ను ఒంటరిగా కారు వద్ద వదిలి వెళ్లడం నేరస్థులకు అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. కనుక ఫ్రెండ్స్‌.. నమ్మకం ఉండాలి, కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదు. కనుక.. ‘ముందుగానే జాగ్రత్త పడితే ప్రమాదం రాదు” అనే నానుడిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ ఆస్తులు, ప్రాణాల రక్షణకు తగిన ముందుజాగ్రత్తలు తీసుకోండి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: బంగారం ధరలకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.1,520 పతనం

Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?

స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు

Follow Us