AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు

స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు

Phani CH
|

Updated on: Sep 24, 2026 | 9:56 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లి కేజీబీవీలో తరచూ పాములు కనిపిస్తుండటంతో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉండటంతో పాటు సరైన కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడం సమస్యకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. గోడలు, బాత్రూమ్‌ల వద్ద రంధ్రాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి, విద్యార్థినుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విషసర్పాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఏదో ఒక పాము పాఠశాల ఆవరణలోకి, తరగతి గదుల్లోకి ప్రవేశిస్తుండటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బంగారు భవిష్యత్తు కోసం హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్థినులు ఇప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాల చుట్టూ సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడం, ఆవరణలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడం వల్లే పాములు సులభంగా లోపలికి ప్రవేశిస్తున్నాయని తెలుస్తోంది. పాఠశాల గోడలు, బాత్రూమ్‌లకు పెద్ద రంధ్రాలు పడినా సిబ్బంది పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలోకి పాములు వస్తే తరిమికొట్టే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో, పిల్లలను చూడటానికి వచ్చే తల్లిదండ్రులే స్వయంగా రంగంలోకి దిగి పాములను బయటకు తరమాల్సి వస్తోంది. “మా పిల్లలను చదువుకోవడానికి పంపామా.. లేక పాముకాట్లకు గురయ్యేందుకు పంపామా?” అని విద్యార్థినుల తల్లిదండ్రులు అధికారులను నిలదీస్తున్నారు. ఏదైనా జరగకూడనిది జరిగి పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి కేజీబీవీ పరిసరాలను శుభ్రం చేయించాలని, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. హైదరాబాద్‌ ర్యాపిడో డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..

రైలు కంపార్ట్‌మెంట్‌లో భయానక దృశ్యం!

దసరాకు ఏపీ – తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు..

Follow Us