లిఫ్ట్ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..
హైదరాబాద్ మూసాపేట ఆంజనేయనగర్‌లో పాత లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లిఫ్ట్ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో రెండో అంతస్తు నుంచి బయటకు వస్తున్న సమయంలో లిఫ్ట్ పైకి కదిలింది. దీంతో మురళి కాలు లిఫ్ట్, గోడ మధ్య గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి వేలాడిపోయాడు. సమాచారం అందుకున్న హైడ్రా డీఆర్‌ఎఫ్, సనత్‌నగర్ ఫైర్ సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి హైడ్రాలిక్ కట్టర్‌తో గోడను తొలగించి ఆయనను రక్షించారు.
హైదరాబాద్‌లోని మూసాపేట ఆంజనేయనగర్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని హైడ్రా సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. మూడంతస్తుల భవనంలోని పాత లిఫ్ట్‌లో సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సతీమణితో కలిసి రెండో అంతస్తుకు వెళ్తున్న మురళి బయటకు వస్తున్న సమయంలో, మూడో అంతస్తులో బటన్ నొక్కడంతో లిఫ్ట్ ఒక్కసారిగా పైకి కదిలింది. దీంతో మురళి కాలు లిఫ్ట్‌కు, గోడకు మధ్య గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి, వేలాడుతూ ఉండిపోయాడు. స్థానికుల సమాచారంతో వెంటనే హైడ్రా మార్షల్ జేడీవీ ప్రసాద్ నేతృత్వంలోని డీఆర్‌ఎఫ్ బృందం, సనత్‌నగర్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి, హైడ్రాలిక్ కట్టర్‌తో లిఫ్ట్ గోడను బద్దలు కొట్టి బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మురళి కాలు విరిగిపోయింది. వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన హైడ్రా, అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు కంపార్ట్‌మెంట్‌లో భయానక దృశ్యం!
దసరాకు ఏపీ – తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. సిలిండర్ పొందాలంటే.. అది తప్పనిసరి
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

