AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulasa Fish: బంగారంతో పోటీపడుతున్న పులస..

Pulasa Fish: బంగారంతో పోటీపడుతున్న పులస..

Phani CH
|

Updated on: Sep 23, 2026 | 9:39 PM

Share

గోదావరి పులసకు ఉన్న డిమాండ్‌ మరోసారి చర్చనీయాంశంగా మారింది. యానాం గౌతమి గోదావరిలో మత్స్యకారుల వలకు కిలో బరువున్న అరుదైన పులస చేప చిక్కింది. స్థానిక వేలంలో తొలుత రూ.15 వేలకు దక్కిన ఈ చేప కోసం తర్వాత తీవ్ర పోటీ నెలకొంది. పెమ్మడి వెంకటేష్‌ ఏకంగా రూ.20 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అనంతరం ఈ పులసను హైదరాబాద్‌ వ్యాపారికి పంపించారు.

చిన్న ముక్క అయినా బంగారం విలువే వేరు. అలాగే చేప చిన్నదైనా గోదావరి పులస ధరే వేరు. వర్షాకాలంలో వరద నీటికి ఎదురీది గోదావరిని తాకగానే ప్రత్యేకమైన రంగు, రుచిని సంతరించుకోవడం పులస ప్రత్యేకత. ‘పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే’ అనే నానుడికి తగ్గట్లే, మాంసప్రియులు ఈ చేప కోసం ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడతారు. ఇటీవల కాలంలో వీటి లభ్యత తగ్గడంతో డిమాండ్ మరింత పెరిగింది. తాజాగా యానాం గౌతమి గోదావరిలో మత్స్యకారుల వలకు ఒక కేజీ బరువున్న అరుదైన పులస చేప చిక్కింది. స్థానికంగా నిర్వహించిన వేలం పాటలో ఒక మత్స్యకారుడు దీనిని మొదట రూ. 15 వేలకు దక్కించుకున్నాడు. ఆ తర్వాత దీనిని కొనుగోలు చేసేందుకు తీవ్ర పోటీ నెలకొనడంతో, పెమ్మడి వెంకటేష్ అనే మత్స్యకారుడు ఏకంగా రూ. 20 వేలు వెచ్చించి ఆ చేపను సొంతం చేసుకున్నాడు. అనంతరం ఆ పులసను హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి గెడ్డం రాజేష్‌కు పంపించారు. గోదావరి పులసలు చాలా అరుదుగా దొరుకుతుండటంతోనే ఈ స్థాయిలో పోటీ, భారీ ధరలు నమోదు అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఎంత ధరైనా సరే, ఈ అరుదైన రుచిని వదులుకోమని మాంసప్రియులు నిరూపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్కారు బడిలోకి ఎంట్రీ ఇచ్చిన రోబో..ఇక టీచర్‌ ఉద్యోగాలనూ

వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు! పెద్దాసుపత్రిలో ఏం జరుగుతోంది?

హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!

దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

గుడ్‌ న్యూస్‌.. గ్యాస్ సిలిండర్‌పై వారికి రూ.600 తగ్గింపు!

Follow Us