సర్కారు బడిలోకి ఎంట్రీ ఇచ్చిన రోబో..ఇక టీచర్ ఉద్యోగాలనూ
తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రోబో టీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఈ రోబో తొలిసారి పేరెంట్స్‌తో నేరుగా మాట్లాడింది. విద్యాబోధన, పిల్లల ప్రగతి, డిజిటల్ విద్యపై తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. క్లిష్టమైన పాఠ్యాంశాలను సులభంగా బోధించేందుకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.
మొన్న గోరింటాకు పెట్టింది… నిన్న సెలూన్‌లో కటింగ్ వేయడం నేర్చుకుంది… ఇవాళ స్కూల్లో అడుగుపెట్టి చకచకా పాఠాలు చెప్పేస్తుంది.అదే ఏఐ… రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక అరుదైన, వినూత్న ప్రయోగానికి వేదికైంది. పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఒక ‘రోబో టీచర్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఇండస్ ల్యాబ్’ సంస్థ పాఠశాలకు బహూకరించిన ఈ రోబో టీచర్, తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. పాఠశాలలో విద్యాబోధన, పిల్లల ప్రగతి, డిజిటల్ విద్య ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ రోబో టీచర్ ఎంతో స్పష్టంగా, ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. సాధారణంగా ఉపాధ్యాయులతో జరిగే సమావే శాలకు భిన్నంగా, రోబోతో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమం తల్లిదండ్రుల్లో ఎంతో కుతూహలాన్ని నింపింది. విద్యార్థులకు ఎంతో క్లిష్టమైన పాఠ్యాంశాలను సైతం సులభంగా, ఆకట్టుకునేలా బోధించడానికే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో ఆధునిక బోధనా పద్ధతులు రావడం అభినందనీయమని కొనియాడారు. సాంకేతికత ఆధారిత విద్యపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం విజయం సాధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు! పెద్దాసుపత్రిలో ఏం జరుగుతోంది?
హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
