AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10: హోస్ట్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. రాగానే త్రిగుణ్‌కు ఇచ్చిపడేసిన మిథిలేష్..

బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య పోటీ, గొడవలు, భావోద్వేగాలు ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఇంటి సభ్యుల ఆటతీరుపై బయట ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయాలను బిగ్ బాస్ స్క్రీన్‌పై చూపించడం హాట్ టాపిక్‌గా మారింది.

Bigg Boss 10: హోస్ట్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. రాగానే త్రిగుణ్‌కు ఇచ్చిపడేసిన మిథిలేష్..
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2026 | 8:51 AM

Share

నిన్నటి (డే 18) ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ ముగ్గురు బిగ్ బాస్ హౌస్ గేట్ వద్ద ప్రత్యక్షం కావడంతో ఇంటి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. వారిని ఇంటి సభ్యులుగా తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల చేతుల్లోనే ఉందని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ఈ ముగ్గురు తమ గురించి, తమ గేమ్ ప్లాన్ గురించి ఇంటి సభ్యులకు వివరించారు. తాను ఇంట్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న గ్రూపులను బ్రేక్ చేస్తానని మిథిలేష్ చెప్పాడు. మాస్టర్స్, పప్పెట్స్ ఎవరో బయటకు తీస్తానని.. ఊసరవెళ్లి, గుంట నక్కల ఆటలను బయటపెడతానని చెప్పాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు పోటీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మిథిలేష్ స్పష్టం చేశాడు.  అపూర్వ తనను తాను పరిచయం చేసుకునే సమయంలో ఇంట్లో కొంతమంది తమ అసలు పర్సనాలిటీని కోల్పోతున్నారని వ్యాఖ్యానించింది. అవసరమైతే వాదిస్తానని, తనను తాను డిఫెండ్ చేసుకుంటానని, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లను ఎక్స్‌పోజ్ చేస్తానని చెప్పింది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కొంతమంది కంటెస్టెంట్లు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదని కూడా ఆమె అభిప్రాయపడింది. బిగ్ బాస్ హౌస్‌లో తాను ‘బటర్‌ఫ్లై’లా మారాలనుకుంటున్నానని చెప్పింది. ఇక రామకృష్ణ మాత్రం చాలా సింపుల్‌గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. జెన్యూన్‌గా ఉంటానని, ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పాడు.  తనను ‘కన్నింగ్’ అని ఎందుకు అన్నావంటూ రాం ప్రసాద్ మిథిలేష్‌ను నిలదీశాడు. గతంలో జరిగిన ‘రన్ రాజా రన్’ టాస్క్‌లో అమన్‌ను కావాలనే బయటకు పంపించాడని, తనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల కోసం అమన్‌ను పక్కన పెట్టినట్టు అనిపించిందని మిథిలేష్ చెప్పాడు. అదే సమయంలో త్రిగుణ్ కూడా మిథిలేష్‌ను ప్రశ్నించాడు. తనను ఎందుకు మానిప్యులేటివ్‌గా చూస్తున్నావని అడిగాడు.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

దానికి స్పందించిన మిథిలేష్.. రోహిత్‌ను ‘స్టెరాయిడ్స్’తో పోల్చడం, ముఖేష్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలు తనకు నచ్చలేదని చెప్పాడు. దీనిపై త్రిగుణ్ కూడా తన వాదనను వినిపించాడు. మిథిలేష్, త్రిగుణ్ మధ్య జరిగిన వాదనలో తెలుగు భాష పై కూడా ప్రస్తావన వచ్చింది. తనకు స్వచ్ఛమైన తెలుగు వచ్చని మిథిలేష్ చెప్పగా.. పద్యాలు చెప్పగలవా అంటూ త్రిగుణ్ ప్రశ్నించాడు. అయితే పద్యాలు చెప్పడం వల్లే తెలుగు వచ్చిందని నిరూపించాల్సిన అవసరం లేదని మిథిలేష్ కౌంటర్ ఇచ్చాడు. అది కాస్తా వాగ్వాదంగా మారింది. ముఖేష్ తనను తాను స్టార్ ప్లేయర్‌గా చెప్పుకునే ప్రయత్నం చేయగా.. అపూర్వ మాత్రం అందుకు గట్టిగానే స్పందించింది. మీకు వచ్చిన ఓట్లు చాలా తక్కువేనని, అవి కూడా మీ కూటమిలోని సభ్యుల నుంచే వచ్చాయని ఆమె కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మిథిలేష్ ఇంట్లోకి వస్తే ఇక్కడ సెట్ కాడని, బయటకు వెళ్లి జిమ్ ట్రైనర్‌గా కొనసాగడం మంచిదని తాను చెబుతానని ముఖేష్ కామెంట్ చేశాడు. ఈ మాటలు రోహిత్‌కు నచ్చలేదు. మిథిలేష్ గురించి అలా మాట్లాడటం సరైంది కాదన్నట్టుగా రోహిత్ రియాక్ట్ అయ్యాడు. ఇక రామకృష్ణ మాత్రం జెన్యూన్‌గా కనిపిస్తున్నాడని, అతను ఇంట్లోకి వస్తే బాగుంటుందని ముఖేష్, సుధీర్, వర్షిణి చర్చించుకున్నారు. ముగ్గురు కొత్త ముఖుల్లో ఎవరు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు కంటెస్టెంట్లపై వచ్చిన ‘బ్యాక్ బిచ్చింగ్ స్టార్’, ‘కన్నింగ్’, ‘మానిప్యులేటివ్’ వంటి కామెంట్లు నెక్స్ట్ ఎపిసోడ్లలో ఎలాంటి చర్చకు దారితీస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us