AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

Phani CH
|

Updated on: Nov 09, 2026 | 5:35 PM

Share

ఆటోలో ఉచితంగా లిఫ్ట్‌ ఇస్తామంటూ మహిళలను నమ్మించి బంగారు గొలుసులు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. వాంతులు వస్తున్నట్లు నటించి బాధితుల దృష్టి మళ్లించి గొలుసులు కాజేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు కలిపి ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు 10 తులాల బంగారం, కారు, ఆటో, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆటోలో ప్రయాణిస్తున్నారు.. పక్కనే ఉన్న మహిళకు అకస్మాత్తుగా వాంతులు వస్తున్నాయి. ఆమెకు సాయం చేయాలని మీరు చూస్తున్నారు. కానీ అదే సమయంలో మీ మెడలోని బంగారు గొలుసు మాయమైతే? వినడానికి సినిమా సీన్‌లా ఉన్నా.. నిజంగానే ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతోంది ఓ అంతర్రాష్ట్ర ముఠా! మహిళలనే లక్ష్యంగా చేసుకుని.. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతోంది. చివరకు ఆదిలాబాద్ పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలో మహిళలు కూడా ఉన్నారు. ముందుగా కారులో, ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న మహిళలను గుర్తిస్తారు. ఆ తర్వాత ఆటోలో ఉచితంగా తీసుకెళ్తామంటూ మాటలు కలుపుతారు. వారి మాటలు నమ్మి ఎవరైనా ఆటో ఎక్కితే.. అసలు దొంగతనం మొదలవుతుంది. ఆటో కొంతదూరం వెళ్లాక ముఠాలోని ఓ మహిళకు వాంతులు వస్తున్నట్లు నటిస్తుంది. దీంతో బాధితురాలి దృష్టి ఆమెపైకి మళ్లుతుంది. ఇదే అదనుగా భావించిన మరో మహిళ.. బాధితురాలి మెడలోని బంగారు గొలుసును కొరికి తెంచి చాకచక్యంగా దొంగిలిస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు బాధితురాలిని ఓ చోట దించి ముఠా సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ ముఠా దొంగతనాలకు ఉపయోగించే ఆటోకు నకిలీ నంబర్ ప్లేట్ అమర్చుకుంటుంది. చోరీ చేసిన తర్వాత కొంతదూరం వెళ్లి ఆటోను వదిలి కారులోకి మారుతుంది. మగ సభ్యులు ఆటోను తీసుకెళ్తారు. ఇలా పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. కేవలం ఆటోల్లోనే కాదు.. శుభకార్యాలు, పండుగల సమయంలోనూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. భోజనాల సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని బంగారు గొలుసులు కాజేస్తారు. 2025లో ఆదిలాబాద్‌లో జరిగిన శ్రీరామనవమి వేడుకల సమయంలోనూ ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆదిలాబాద్‌లో ఓ మహిళకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని చెప్పి గొలుసు దొంగిలించారు. అక్టోబర్ 31న నిర్మల్ పట్టణంలో ఇద్దరు మహిళల బంగారు గొలుసులను కూడా కాజేశారు. ఈ ముఠా గుట్టును రట్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు.. ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు కలిపి మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరంతా మహారాష్ట్రలోని వార్ధాకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, చోరీలకు ఉపయోగించిన కారు, ఆటోతో పాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ఈ ముఠా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం.. తెలియని వ్యక్తులు ఆటోలో ఉచితంగా తీసుకెళ్తామంటే వెంటనే నమ్మకండి. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఆటోలో ఎవరైనా వింతగా ప్రవర్తించినా, అనుమానం కలిగించే పరిస్థితులు ఎదురైనా జాగ్రత్త పడండి. అవసరమైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చిన్నపాటి అప్రమత్తత.. పెద్ద నష్టాన్ని తప్పించవచ్చు. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ప్రయాణించండి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి

బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మించిన రాబడినిచ్చే ప్రభుత్వ పథకాలు.. 100% సేఫ్‌

Follow Us