AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి

షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి

Phani CH
|

Updated on: Nov 09, 2026 | 5:09 PM

Share

అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రం సౌత్‌పోర్ట్‌లో ఓ బేగెల్‌ షాపులోకి మూడు అడుగుల మొసలి ప్రవేశించి కలకలం రేపింది. కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురవుతుండగా ఓ వ్యక్తి కుర్చీని అడ్డుగా పెట్టి దానిని నిలువరించాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకుని మరో ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ షాపులోకి ఊహించని అతిథి ఎంట్రీ ఇచ్చి కలకలం సృష్టించింది. సౌత్‌పోర్ట్‌లోని ‘బేగెల్ డాక్ ఎక్స్‌ప్రెస్’ షాప్‌లోకి మూడు అడుగుల పొడవున్న చిన్న మొసలి వెనుక డోర్ ద్వారా లోపలికి ప్రవేశించింది. కొందరు కాఫీ తాగుతూ, బేగెల్స్ కొనుక్కుంటున్న సమయంలో అకస్మాత్తుగా కౌంటర్ ముందుకు దూసుకొచ్చిన మొసలిని చూసి కస్టమర్లు, సిబ్బంది హడలిపోయారు. షాప్ యజమాని జెస్సీ డ్రిస్కాల్ కొత్త ఓవెన్ ఏర్పాటు చేసే పనిలో ఉండగా ఎదురుగా మొసలి కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. అయితే ఓ కస్టమర్ వెంటనే అప్రమత్తమై అక్కడి కుర్చీని అడ్డుగా పెట్టి మొసలిని తనదగ్గరకు రాకుండా నిలువరించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, యానిమల్ ప్రొటెక్షన్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని మొసలిని సురక్షితంగా బంధించి మరో ప్రాంతానికి తరలించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. మొసళ్లకు ఆహారం వేయడం వల్ల అవి జనావాసాల వైపు వస్తున్నాయని, వాటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మించిన రాబడినిచ్చే ప్రభుత్వ పథకాలు.. 100% సేఫ్‌

మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

Follow Us