విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు
భారత పౌర విమానయాన రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 1937 నాటి ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ స్థానంలో ‘భారతీయ వాయుయాన్ నియమ్-2026’ను తీసుకొచ్చినట్లు కథనం పేర్కొంటోంది. 2027 జనవరి 1 నుంచి అమలుకానున్న ఈ నిబంధనల్లో విమానాల తయారీ, సర్టిఫికేషన్, లీజింగ్, పైలట్ల లైసెన్సింగ్, భద్రతకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్, IDERA వంటి విధానాల ద్వారా విమానయాన రంగంలో మార్పులు రానున్నాయి.
దేశ పౌర విమానయాన రంగంలో చారిత్రక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 90 ఏళ్లుగా అమల్లో ఉన్న 1937 నాటి ‘ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్’ స్థానంలో సమగ్రమైన “భారతీయ వాయుయాన్ నియమ్-2026″ను తీసుకువచ్చింది. వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగానికి అనుగుణంగా రూపొందించిన ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మొత్తం 8 అధ్యాయాలు, 6 షెడ్యూళ్లలో 220 నిబంధనలతో ఈ నూతన చట్టాన్ని రూపొందించారు. ఈ కొత్త నిబంధనల ద్వారా విమానాల డిజైన్, తయారీ, సర్టిఫికేషన్ కోసం స్పష్టమైన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల విమానాల విడిభాగాలను భారత్‌లోనే తయారు చేసే అధికారం లభించి, ‘స్టేట్ ఆఫ్ డిజైన్’గా దేశ స్థానం బలోపేతం కానుంది. అలాగే, ఒక విమానాన్ని పలువురు కలిసి కొనుగోలు చేసే ‘ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. విమానాల లీజింగ్, కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసే IDERA విధానం ద్వారా విమానయాన సంస్థల వ్యయం తగ్గి, భవిష్యత్తులో విమాన టికెట్ ఛార్జీలు కూడా తగ్గే అవకాశం ఉంది. కొత్త రూల్స్‌తో నియంత్రణ సంస్థ అయిన డీజీసీఏ కు మరిన్ని విస్తృత అధికారాలు లభించాయి. భారత్‌లో డిజైన్ చేసిన విమానాలు, ఇంజిన్లకు టైప్ సర్టిఫికేట్లు ఇచ్చే అధికారంతో పాటు భద్రతాపరమైన అత్యవసర ఆదేశాలు జారీ చేసే హక్కు డీజీసీఏకు ఉంటుంది. అంతేకాకుండా, పైలట్లు, ఫ్లైట్ ఇంజనీర్లతో సహా 23 కేటగిరీల విమానయాన సిబ్బంది లైసెన్సింగ్, శిక్షణ, వైద్య ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా నిర్దేశించారు. ఛార్జీలలో పారదర్శకత పెంచడంతో పాటు అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే వీలుకలిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మించిన రాబడినిచ్చే ప్రభుత్వ పథకాలు.. 100% సేఫ్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?
ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్.. వర్క్ ఫ్రమ్ పార్క్

