AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదొక్కటి వేస్తే చాలు.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి!

ఇంటి పెరట్లో లేదా టెర్రస్ గార్డెన్‌లో ఎంతో ఇష్టపడి పండ్ల మొక్కలు నాటినప్పుడు.. అవి ఏపుగా పెరిగినా సరైన కాపు రాకపోవడం, వచ్చిన పూత పిందె దశలోనే రాలిపోవడం చాలామందిని నిరాశపరుస్తుంది. పండ్ల మొక్కలకు సాధారణ నత్రజని ఎరువులు మాత్రమే ఇస్తే ఆకులు పచ్చగా పెరుగుతాయి తప్ప పండ్లు కాయవు; పూత బలంగా నిలబడి, పిందె పెద్ద సైజు పండ్లుగా మారడానికి ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు తప్పనిసరిగా అందాలి. పుష్ప గారు తన గార్డెన్‌లోని 30 రకాల పండ్ల మొక్కలకు గత 10 ఏళ్లుగా వేస్తున్న ఈ శక్తివంతమైన ఆర్గానిక్ ఎరువుల మిశ్రమాన్ని అందిస్తే కాపు కాయని చెట్లు సైతం గుత్తులు గుత్తులుగా పండ్లతో విరగకాస్తాయి.

Phani CH
|

Updated on: Nov 09, 2026 | 9:11 PM

Share
కావలసిన పదార్థాలు: 5 కిలోలు బాగా మాగిన మేక ఎరువు (మేక ఎరువు లేకపోతే ఆవు పేడ ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వాడవచ్చు), పావు కిలో ఆవపిండి పొడి, పావు కిలో బోన్ మీల్ (ఎముకల పొడి),  2 నుండి 3 టేబుల్ స్పూన్ల వేపపిండి, ఎరువు వినియోగ మోతాదులు: 5 నుండి 10 ఏళ్ల పెద్ద నేల చెట్లకు – 2½ కిలోలు 1 నుండి 2 ఏళ్ల చిన్న మొక్కలకు లేదా కుండీల్లోని మొక్కలకు – అరకిలో

1 / 5
ఆర్గానిక్ మిశ్రమం తయారీ: ఒక పెద్ద ట్రే లేదా బేసిన్‌లో 5 కిలోల బాగా మాగిన మేక ఎరువును వేయాలి. ఇందులో పావు కిలో ఆవపిండి పొడి, పావు కిలో బోన్ మీల్, 3 టేబుల్ స్పూన్ల వేపపిండి వేయాలి. చేతులతో లేదా గరిటెతో ఈ నాలుగు ఎరువులు ఒకదానికొకటి సమానంగా కలిసేలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
మొక్క మొదట్లో మట్టి సిద్ధం చేయడం: ఎరువు ఇచ్చే ముందు పండ్ల మొక్క మొదట్లో కాండానికి నేరుగా తగలకుండా, కాండం చుట్టూ అరడుగు నుండి ఒకడుగు వలయాకారంలో పైనున్న మట్టిని 2-3 అంగుళాల లోతు వరకు గరిటె లేదా ఖుర్పాతో మెల్లగా తవ్వి పక్కకు తీయాలి. సన్నటి ఫీడర్ వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

3 / 5
ఎరువు వేయడం & మట్టి కప్పడం: తవ్విన వలయాకార గాడిలో తయారుచేసి ఉంచుకున్న ఎరువుల మిశ్రమాన్ని వేయాలి. పెద్ద చెట్లకు (సపోటా, వాటర్ ఆపిల్ వంటి 10 ఏళ్ల చెట్లకు) రెండున్నర కిలోల వరకు, చిన్న మొక్కలకైతే అరకిలో వరకు సమానంగా పరవాలి. ఆ తర్వాత పక్కకు తీసిన మట్టితో ఎరువు పైభాగం పూర్తిగా కనపడకుండా కప్పి వేయాలి; ఎరువు నేరుగా ఎండకు గురికాకుండా మట్టి కింద ఉంటేనే సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. ఎరువు వేసి మట్టి కప్పిన వెంటనే ఆ ప్రాంతం పూర్తిగా తడిసేలా సమృద్ధిగా నీళ్లు పోయాలి. నీరు పోయడం వల్ల ఎరువులోని పోషకాలు కరిగి వేర్ల ద్వారా మొక్కకు త్వరగా అందుతాయి.

4 / 5
ఎప్పుడు ఏ మొక్కకు వేయాలి? కాపు మొదలయ్యే సీజన్‌కు నెల రోజుల ముందే (నవంబర్ నెలలో) సంవత్సరానికి ఒకేసారి అందించాలి. నిత్య కాపునిచ్చే మొక్కలు (సపోటా, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, మల్బరీ) పూత పిందె నిలబడి, పండ్లు పెద్ద సైజులో రావడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వేయాలి. అంతే, ఈ సహజసిద్ధమైన ఎరువు అందించిన కొద్ది రోజుల్లోనే మొక్క ఆకులు ముదురు పచ్చదనంతో కొత్త చిగుళ్లు తొడిగి.. కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులుగా పూత పూసి, గంపల కొద్దీ నాణ్యమైన తియ్యటి పండ్ల దిగుబడిని అందిస్తుంది!

5 / 5
Follow Us
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి

ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ

బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..

'శ్రీరాముడిగా' సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. కానీ..

ఎర్రగా నిగనిగలాడే ఆపిల్స్ చూసి మోసపోకండి.. స్వీట్ ఆపిల్స్‌ని..

ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం

మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 

 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?

Video: కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన ఏలియన్స్.. ట్రంప్ షాక్

కరోనాతో చావు అంచుల్లో.. ఆ నటుడే ఆస్పత్రికి వచ్చి రూ.లక్ష కట్టాడు