బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరంలో పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీగా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కోటేశ్వరరావు మద్దతుదారుల ఇళ్లపై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.