మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్.. షాక్‌లో స్టాఫ్
దుబాయ్‌కు చెందిన వరల్డ్ స్టార్ హోల్డింగ్ సంస్థ ఎండీ హసీనా నిషాద్ తన కంపెనీలోని మహిళా ఉద్యోగులకు ఖరీదైన ఐఫోన్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఉన్నత హోదాల్లో పనిచేసే వారితో పాటు హౌస్‌కీపింగ్ సిబ్బందికీ ఈ కానుక అందించారు. ఊహించని బహుమతిని చూసిన ఓ మహిళా ఉద్యోగి భావోద్వేగానికి గురై హసీనాను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మనలో చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటాం. బాస్ ఇచ్చే టార్గెట్లు, తిట్లు తప్ప విలువైన బహుమతులు ఎప్పుడైనా చూసామా? కానీ ఒక మహిళా బాస్ మాత్రం తన కంపెనీలో పనిచేసే ప్రతీ మహిళా ఉద్యోగికి ఏకంగా రూ. 3 లక్షల విలువైన సరికొత్త ‘ఐఫోన్ డూ’ ఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చి ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా చేశారు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘వరల్డ్ స్టార్ హోల్డింగ్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న హసీనా నిషాద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. కేరళకు చెందిన హసీనా, తన కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఎవరికీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అందరినీ ఒక కాన్ఫరెన్స్ రూమ్‌కి పిలిచారు. ఉద్యోగులు వచ్చి తమ కుర్చీలలో కూర్చోగానే.. టేబుల్ కింద రహస్యంగా ఉంచిన గిఫ్ట్ బాక్స్‌లను అందించారు. ఆ బాక్స్‌లను తెరిచి చూసిన మహిళలకు మైండ్ బ్లాంక్ అయింది. అందులో లేటెస్ట్ యాపిల్ ‘ఐఫోన్ డూ’ ఫోన్లు దర్శనమిచ్చాయి. ఈ సర్ప్రైజ్‌లో హైలైట్ ఏంటంటే.. కేవలం పెద్ద పొజిషన్లలో ఉన్నవారికే కాకుండా, ఆఫీస్‌లో హౌస్‌కీపింగ్ పని చేసే సాధారణ మహిళా సిబ్బందికి కూడా ఈ ఐఫోన్ దక్కింది. ఆ సమయంలో హసీనా నిషాద్‌కు శరబత్ అందించడానికి వచ్చిన ఆ హౌస్‌కీపింగ్ వర్కర్ చేతికి కూడా ఆ గిఫ్ట్ బాక్స్ అందింది. కలలో కూడా ఊహించని ఈ బహుమతిని చూసి ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఎండీ హసీనా నిషాద్‌ను గట్టిగా కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూసిన ప్రతీ ఒక్కరి కళ్ళూ చెమర్చాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రతీ మహిళా తనదైన కలలు, బాధ్యతలతో ముందుకు వెళ్తుంది.. ఒక మహిళ ఎదిగితే అది మరో మహిళకు ధైర్యాన్ని ఇస్తుంది అంటూ హసీనా నిషాద్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్
కాశీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్ రోప్‌వే సిద్ధం
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!

