AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

Phani CH
|

Updated on: Nov 09, 2026 | 5:41 PM

Share

2028 ఐపీఎల్‌ మెగా వేలానికి ముందే స్టార్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ ఫీజులపై చర్చ మొదలైంది. కొందరు ఆటగాళ్లు తమను జట్టులో కొనసాగించాలంటే రూ.40 కోట్లు చెల్లించాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు 2027 మినీ వేలానికి ముందు రిటెన్షన్‌ జాబితాల గడువును బీసీసీఐ నవంబర్‌ 17కు పొడిగించింది. డిసెంబర్‌ 16న గోవాలో వేలం జరగనుంది. రిషభ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌ సహా పలువురు ఆటగాళ్ల ట్రేడ్స్‌ కూడా ఆసక్తి రేపుతున్నాయి.

ఐపీఎల్‌లో ఆటగాళ్ల రిటెన్షన్ ఫీజుల వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. 2028 సీజన్‌కు ముందు జరగనున్న మెగా వేలాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు స్టార్ ఆటగాళ్లు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా రూ.40 కోట్లు చెల్లిస్తేనే తమను రిటైన్ చేసుకోవాలని ఫ్రాంచైజీలకు సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఒక ఆటగాడికి వేలంలో చెల్లించిన అత్యధిక మొత్తం రూ.27 కోట్లు. 2025 వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఈ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు కొందరు ఆటగాళ్లు అంతకంటే ఎక్కువగా రూ.40 కోట్ల రిటెన్షన్ ఫీజును ఆశిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఒక్కో ఫ్రాంచైజీ పర్స్ విలువ రూ.120 కోట్లు కాగా.. వచ్చే మెగా వేలం నాటికి ఇది రూ.150 కోట్లకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో స్టార్ ఆటగాళ్లు తమ మార్కెట్ విలువను దృష్టిలో పెట్టుకుని భారీ మొత్తాలను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. 2027 ఐపీఎల్ మినీ వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలను సమర్పించే గడువును బీసీసీఐ రెండు రోజులు పొడిగించింది. తొలుత నవంబర్ 15గా నిర్ణయించిన గడువును నవంబర్ 17కు మార్చింది. డిసెంబర్ 16న గోవాలో మినీ వేలం జరగనుంది. మరోవైపు వేలానికి ముందే రెండు కీలక ట్రేడ్స్ జరిగాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ డీల్‌లో ఢిల్లీ నుంచి కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లినట్లు సమాచారం. మరో ట్రేడ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పంపించి, లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని తీసుకుంది. మొత్తానికి 2027 మినీ వేలానికి ముందే ఐపీఎల్‌లో ఆటగాళ్ల ధరలు, ట్రేడ్స్, రిటెన్షన్ వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే మెగా వేలానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే రూ.40 కోట్ల డిమాండ్ చర్చకు దారితీస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాశీలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్‌ రోప్‌వే సిద్ధం

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి

Follow Us