కాశీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్ రోప్‌వే సిద్ధం
వారణాసిలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సుమారు 4.2 కిలోమీటర్ల మార్గంలో ఐదు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆకాశ మార్గం అందుబాటులోకి వస్తే రైల్వే స్టేషన్ నుంచి గోడోలియా చౌక్‌కు చేరుకునే సమయం 15 నుంచి 16 నిమిషాలకు తగ్గవచ్చని అంచనా. కాశీకి వచ్చే భక్తులు, పర్యాటకులకు ప్రయాణం సులభం కానుంది.
ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి లో రోడెక్కాలంటేనే చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ నరకానికి చెక్ పెట్టేందుకు ఒక సరికొత్త రవాణా విప్లవం ఆవిష్కృతమవుతోంది. దేశంలోనే తొలిసారిగా అక్కడ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే అందుబాటులోకి వస్తోంది. సాధారణంగా వారణాసి రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన ఘాట్లు లేదా గోడోలియా చౌక్ చేరుకోవాలంటే ఇరుకైన రోడ్లు, కిక్కిరిసిన ట్రాఫిక్ కారణంగా దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త ఆకాశ మార్గం అందుబాటులోకి వస్తే కింద ఉన్న ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా కేవలం 15 నుంచి 16 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సుమారు 4.2 కిలోమీటర్ల పొడవున్న ఈ రోప్‌వే కారిడార్‌లో మొత్తం 5 కీలక స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, కాశీ విద్యాపీఠం, రథయాత్ర, గిర్‌జాఘర్ మరియు గోడోలియా చౌక్ ఈ మార్గంలో ఉంటాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా కేబుల్ కార్ల క్యాబిన్లను కాశీ విశ్వనాథ ఆలయం, వారణాసి ఘాట్ల ఆధ్యాత్మిక ఉనికి ఉట్టిపడేలా అత్యంత సుందరంగా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో దాదాపు 148 నుంచి 220 కేబుల్ కార్లను వినియోగించనుండగా, ఒక్కో కార్‌లో గరిష్టంగా 10 మంది ప్రయాణించవచ్చు. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ‘బార్టోలెట్’ సంస్థ సాంకేతిక సహకారంతో రూ.645 కోట్ల నుంచి రూ.815 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రోప్‌వే ట్రయల్ రన్లు, తుది దశ పనులు జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇకపై కాశీకి వచ్చే భక్తులు, పర్యాటకులు రోడ్లపై గంటల తరబడి ఇరుక్కోకుండా ఆకాశ మార్గంలో విహరిస్తూ నేరుగా విశ్వనాథుని దర్శనానికి చేరుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు
రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

