AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర

గోదారోళ్ళు ఎంతో ఇష్టంగా తినే ప్రత్యేకమైన, ఎంతో రుచికరమైన పెసర వడియాల కూర తయారీ విధానాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ కూర రైస్, చపాతీ వంటి వాటితో చాలా అద్భుతంగా ఉంటుంది. పెసర వడియాలు నిల్వ ఉండటంతో, కూరగాయలు లేని సమయంలో ఇది ఇది చక్కగా చేసుకుని తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Nov 09, 2026 | 9:14 PM

Share

 గోదారోళ్ళు ఎంతో ఇష్టంగా తినే ప్రత్యేకమైన, ఎంతో రుచికరమైన పెసర వడియాల కూర తయారీ విధానాన్ని ఇక్కడ  వివరంగా తెలుసుకుందాం. ఈ కూర రైస్, చపాతీ వంటి వాటితో చాలా అద్భుతంగా ఉంటుంది. పెసర వడియాలు నిల్వ ఉండటంతో, కూరగాయలు లేని సమయంలో ఇది ఇది చక్కగా చేసుకుని తినొచ్చు.

గోదారోళ్ళు ఎంతో ఇష్టంగా తినే ప్రత్యేకమైన, ఎంతో రుచికరమైన పెసర వడియాల కూర తయారీ విధానాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ కూర రైస్, చపాతీ వంటి వాటితో చాలా అద్భుతంగా ఉంటుంది. పెసర వడియాలు నిల్వ ఉండటంతో, కూరగాయలు లేని సమయంలో ఇది ఇది చక్కగా చేసుకుని తినొచ్చు.

1 / 5
 
పెసర వడియాలు తయారుచేయడానికి, ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని, అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ పిండిని చిన్న వడియాలుగా కవర్ మీద పెట్టుకుని ఒక రోజంతా ఎండబెడితే, ఇవి సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటాయి. వడియాలు గుల్లగా రావాలంటే సగం తొక్క పెసరపప్పు, సగం సాయి పెసరపప్పు కలిపి ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా, పిండిలో అల్లం వేయకూడదు, లేదంటే పిండి విరిగిపోయి వడియాలు సరిగ్గా రావు.

2 / 5
ముందుగా ఒక పాన్ పెట్టి, రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత, పెసర వడియాలను వేసి వేయించాలి. వడియాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి, మధ్యస్థ మంట మీద బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వడియాలు నూనెను పీల్చుకుంటాయి కాబట్టి తక్కువ నూనెతో వేయించడం మంచిది.

3 / 5
అదే పాన్‌లో మరో మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత, నాలుగు పెద్ద ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేయాలి. కొద్దిగా ఉప్పు చేర్చడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించుకోవాలి.

4 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత, పావు స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం వేసి బాగా కలపాలి. మసాలాలు అన్ని ఉల్లిపాయలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పెసర వడియాలను వేసి, మసాలాలతో బాగా కలిసేలా కలుపుకోవాలి.ఒక గ్లాసు నీళ్లు పోసి, వడియాలు నీటిలో బాగా కలిసేలా చూసుకోవాలి. మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత వడియాలు ఉడికి పెద్దవి అవుతాయి.ఈ దశలో కొద్దిగా పాలను చేర్చాలి. పాలు చేర్చడం వల్ల పెసర వడియాల కూరకు అద్భుతమైన కమ్మటి రుచి వస్తుంది. పాలు వడియాలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. పాలు పూర్తిగా వడియాలలో ఇంకిపోయి, వడియాలు బాగా ఉడికిపోతాయి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే రుచికరమైన గోదావరి స్పెషల్ పెసర వడియాల కూర రెడీ.

5 / 5
Follow Us
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి

ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ

బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..

'శ్రీరాముడిగా' సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. కానీ..

ఎర్రగా నిగనిగలాడే ఆపిల్స్ చూసి మోసపోకండి.. స్వీట్ ఆపిల్స్‌ని..

ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం

మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 

 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?

Video: కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన ఏలియన్స్.. ట్రంప్ షాక్