AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క పాలు, పంచదార లేకుండా చేసే అటుకుల స్వీట్.. నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే టేస్టీగా

స్వీట్స్ తినాలనే కోరిక ఉండేవాళ్ళు.. ఈ అటుకుల స్వీట్ చేసుకుని తినొచ్చు. దీనిలో నూనె, పంచదార, నెయ్యి, పాలు వంటివి వాడకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా చాలా హెల్తీగా, టేస్టీగా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా బాగా నచ్చుతుంది.

Prasanna Yadla
|

Updated on: Nov 24, 2026 | 6:51 AM

Share

ముందుగా, స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక కప్పు పెద్ద అటుకులు వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఐదు నుండి 6 నిమిషాల పాటు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు  దీనిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అటుకులను ఒక ప్లేట్‌లోకి తీసుకుని వీటిని  పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

1 / 5
 అదే పాన్‌లో, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు పలుకులు, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ ఇతర డ్రై ఫ్రూట్స్‌నైనా వాడుకోవచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకుని మరీ మెత్తటి పౌడర్‌లా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5

ఇప్పుడు అదే పాన్ లోకి, ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇందులోకి పావు కప్పు నీళ్లు పోసి, బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ బెల్లం నీళ్ళను వడగట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే తొలగిపోతాయి.

3 / 5
ఇంకా వడగట్టిన బెల్లం నీళ్ళను మరలా పాన్ లోకి పోసి స్టవ్ ఆన్ చేసి మరిగించుకోవాలి. బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, మంచి సువాసన కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి, మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని, ఈ మిశ్రమం పాన్ నుండి విడిపోతూ, దగ్గరపడేంత వరకు ఉడికించుకోవాలి.

4 / 5

మిశ్రమం పాన్ కి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌కు కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. ప్లేట్‌లో వేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి, ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. ఈ అటుకుల స్వీట్ చాలా చాలా బాగుంటుంది, నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది. పంచదార కన్నా బెల్లంతో చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకసారి కచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది

5 / 5
Follow Us