AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!

ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయుర్వేదంలో దీనిని అత్యంత ప్రయోజనకరమైన దివ్యౌషధంగా, అమృతంతో సమానంగా పరిగణిస్తారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అనేక పోషకాలు నిండి ఉన్న ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. అయితే, చాలామందిలో ఒక సాధారణ సందేహం ఉంటుంది.. అదేంటంటే, ఉసిరికాయ తినడానికి సరైన సమయం ఎప్పుడు? దీనిని ఖాళీ కడుపుతో తినవచ్చా లేదా? అనే విషయాలపై ఆయుర్వేద నిపుణుల సలహాలు ఇక్కడ తెలుసుకుందాం.

Amla Benefits
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2026 | 9:58 PM

Share

ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయుర్వేదంలో దీనిని అత్యంత ప్రయోజనకరమైన దివ్యౌషధంగా, అమృతంతో సమానంగా పరిగణిస్తారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అనేక పోషకాలు నిండి ఉన్న ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. అయితే, చాలామందిలో ఒక సాధారణ సందేహం ఉంటుంది.. అదేంటంటే, ఉసిరికాయ తినడానికి సరైన సమయం ఎప్పుడు? దీనిని ఖాళీ కడుపుతో తినవచ్చా లేదా? అనే విషయాలపై ఆయుర్వేద నిపుణుల సలహాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం వల్ల లాభాలు:

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం పూట ఖాళీ కడుపుతో తాజా ఉసిరికాయను లేదా దాని రసాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందించి, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. క్రమం తప్పకుండా ఉసిరి తీసుకోవడం వల్ల చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. జుట్టు కుదుళ్లు బలపడి ఒత్తుగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

అందరికీ ఖాళీ కడుపుతో మంచిదేనా?

అయితే, ఖాళీ కడుపుతో ఉసిరి తినడం అందరికీ పడకపోవచ్చు. ఎవరికైతే అసిడిటీ, గ్యాస్ సమస్యలు, కడుపులో మంట లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉందో వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మానుకోవాలి. ఇది వారిలో కడుపు అసౌకర్యాన్ని మరింత పెంచవచ్చు. అలాంటి వారు అల్పాహారం లేదా భోజనం చేసిన తర్వాత ఉసిరిని తీసుకోవడం సురక్షితం.

ఉసిరిని ఎలా తీసుకోవాలి?

తాజా ఉసిరికాయను పచ్చిగా తినడం లేదా రసం రూపంలో తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, దీనిని మురబ్బా, చూర్ణం, లేదా క్యాండీ రూపంలో కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. మోతాదులో తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!
చికెన్, మటన్ కన్నా బలమైన ఫుడ్ ఇదే.. గుప్పెడు తింటే చచ్చుబడ్డ నరాల

గోవర్ధన పూజ రోజు ఈ 4 దానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం.. సుఖసంతోషాలు..

దేశాన్ని కుదిపేసిన జంట హత్య.. OTTలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?

విరమిస్తాడా.. విరుచుకుపడతాడా..? పశ్చిమాసియాలో ట్రంపరేషాన్లు..

క్షణాల్లో చేసుకోగలిగే జ్యుసీ చికెన్ స్నాక్..

నోటి పూతలను తగ్గించడంలో తమలపాకు మ్యాజిక్‌ తెలిస్తే వదిలిపెట్టరు..

రోడ్డుపై వెళ్తుండగా ఏదో కదులుతూ కనిపించింది.. బైక్ చూస్తే గుండె..

సంపద, ఐశ్వర్యం పెరగాలంటే ఈ రుద్రాక్ష ధరించండి.. లక్ష్మీదేవి..

ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయిన కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్