చలికాలంలో బత్తాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

samatha

9  November 2026

Pic credit - Pinterest

చలికాలంలో బత్తాయి పండ్లు ఎక్కువగా లభిస్తుంటాయి. తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటారు.

బత్తాయి పండ్లు

మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఈ బత్తాయిలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు.

కొనుగోలు చేయడం

మరి అసలు ఈ చలికాలంలో బత్తాయి తినడం  ఆరోగ్యానికి మంచిదేనా. దీని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

ప్రయోజనాలు

బత్తాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని చలికాలంలో తినడం  వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

విటమిన్ సి

అంతే కాకుండా శీతాకాలంలో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతుంటారు. వారు దీనిని తినడం వలన ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా బయటపడతారు.

వైరల్ ఇన్ఫెక్షన్స్

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా బత్తాయి చాలా మంచిది. ఇందులోని ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

బత్తాయి గుండెకు మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. అందువలన ఇది రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుండెకు మేలు

చర్మ ఆరోగ్యానికి కూడా బత్తాయి పండు చాలా మంచిది. దీనిని తినడం వలన చర్మం మెరవడమే కాకుండా, ముడతలు రాకుండా యవ్వనంగా ఉంటుంది.

చర్మ ఆరోగ్యం