AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయాడు.. కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్!

కన్నతల్లి మరణం ఆ కొడుకును తీవ్రంగా కలచివేసింది. క్రూర మృగం దాడిలో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆ బాధను తట్టుకోలేకపోయాడు. కానీ ఆ విషాదాన్ని తలుచుకుంటూ కుంగిపోలేదు. తనకు ఎదురైన కష్టం మరే కుటుంబానికీ రాకూడదని నిర్ణయించుకున్నాడు. తనకున్న సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో వన్యప్రాణుల దాడుల గురించి ప్రజలను అలర్ట్ చేసే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఇప్పుడు ఆ వెబ్‌సైట్ వేలాది మందికి ఉపయోగపడుతోంది.

ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయాడు.. కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్!
He Lost His Mother To A Bear Attack Now His Website Warns Others Of Wild Animals
Sharada V
|

Updated on: Nov 09, 2026 | 9:14 PM

Share

కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముదాసిర్ అలీ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఏడాది క్రితం తల్లి ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మర్చిపోలేని విషాదంగా మిగిలిపోయింది. అతని మనసులో ఒకే ఆలోచన మొదలైంది. వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రమాదం గురించి ముందుగానే తెలిస్తే కనీసం కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చని భావించాడు. సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో  ‘వైల్డ్‌పింగ్’ (Wildping) ఉచిత వెబ్‌సైట్‌ను రూపొందించాడు. తల్లి మరణించిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్‌లో వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.

తల్లి మరణం తర్వాత ఈ ఆలోచన మనసులో ఉండేదని ముదాసిర్ అలీ తెలిపాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరిగే ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. తాను అనుభవించిన బాధను మరెవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపాడు.

ఎలుగుబంటి ఎక్కడ కనిపించినా అలర్ట్

ఈ వెబ్‌సైట్‌ ప్రత్యేకత ఏంటంటే వన్యప్రాణులు ఎక్కడ సంచరిస్తున్నాయో స్థానికులే సమాచారాన్ని నమోదు చేస్తారు. ఒక గ్రామం సమీపంలో ఎలుగుబంటి కనిపిస్తే దాన్ని గుర్తించిన వ్యక్తి వెంటనే Wildping వెబ్‌సైట్‌లో ఆ వివరాలను నమోదు చేస్తాడు. అలాగే చిరుతపులులు, ఇతర వన్యప్రాణుల సంచార సమాచారాన్ని అందులో ఎంటర్ చేస్తారు.

ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న వారికి మొబైల్ ఫోన్‌లో హెచ్చరికలు అందుతాయి.  అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు.  పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా ప్రయాణించేవారికి ఈ సమాచారం హెల్ప్ అవుతోంది.  వెబ్ సైట్ లో కొన్ని ప్రాంతాల చుట్టూ అలర్ట్ జోన్లను ఏర్పాటు చేసుకునే సదుపాయం ఉంది.  తమ ఇల్లు, పొలం, పాఠశాల, పిల్లలు నడుచుకుంటూ వెళ్లే దారులను ఆ జోన్లలో చేర్చే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల సమీపంలో ఎలుగుబంటి లేదా చిరుతపులి కనిపిస్తే వెంటనే హెచ్చరిక వస్తుంది.

ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతానికి పిల్లలను పంపక పోవడం, పొలాలకు వెళ్లడం వాయిదా వేసుకోవడం, అవసరమైతే అధికారులకు సమాచారం ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  వన్యప్రాణుల దాడులను పూర్తిగా ఆపలేకపోయినా ప్రమాదానికి ముందే అలర్ట్ ఇవ్వడం ద్వారా ఒక కుటుంబాన్ని కాపాడే అవకాశం ఉందని ముదాసిర్ వివరించారు.

కశ్మీర్‌లో పెరుగుతున్న ఎలుగుబంటి దాడులు

హిమాలయ ప్రాంతాల్లో మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, జంతువుల సహజ నివాస ప్రాంతాలు తగ్గడంతో వన్యప్రాణులు జనావాసాల వైపు వస్తున్నాయి. దీంతో ప్రజలు, జంతువులు ఎదురెదురుపడే ఘటనలు పెరుగుతున్నాయి. 2023 నుంచి కశ్మీర్ లో వన్యప్రాణుల దాడుల్లో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో 80 శాతానికి పైగా మరణాలు హిమాలయన్ బ్లాక్ బేర్స్ వల్ల జరుగుతున్నాయి. హిమాలయన్ బ్లాక్ బేర్స్ అడవులతో కూడిన పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. బ్రౌన్ బేర్స్ సాధారణంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. చిరుతపులులు కూడా అడవుల్లో సంచరిస్తూ అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి.

నెల రోజుల్లోనే 9 వేల మంది సందర్శన.. స్థానికుల ప్రశంసలు!

ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లోనూ వన్యప్రాణుల కదలికలను తెలియజేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే కశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముదాసిర్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే ఈ వెబ్‌సైట్‌ను సుమారు 9 వేల మంది సందర్శించారు. వందలాది మంది ఉపయోగిస్తున్నారు. వన్యప్రాణులు కనిపించినప్పుడు వెంటనే సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.

గత వారం తమ ప్రాంతంలో ఎలుగుబంటి కనిపించగానే వెంటనే వెబ్‌సైట్‌లో సమాచారం నమోదు చేసినట్లు యాసిర్ ఇక్బాల్ అనే స్థానికుడు తెలిపాడు.   గ్రామంలో చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారని,  ప్రాణాలను కాపాడటానికి వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుందని అన్నాడు.

తల్లి జ్ఞాపకార్థం.. మరెన్నో కుటుంబాలకు రక్షణ!

ఒక ప్రమాదం గురించి ముందుగానే తెలిస్తే ఒక కుటుంబం బయటకు వెళ్లకుండా ఆగుతుంది. పిల్లలు ప్రమాదకర ప్రాంతానికి వెళ్లరు. ఆ చిన్న అప్రమత్తతే ప్రాణాలను కాపాడుతోంది. తన తల్లిని కోల్పోయిన బాధ నుంచి పుట్టిన ఈ ఆలోచన ఇప్పుడు మరెంతోమందికి భరోసాగా మారుతోంది. టెక్నాలజీని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగిస్తే ఎంతటి మంచి ఫలితాలు వస్తాయో ముదాసిర్ ప్రయత్నం నిరూపిస్తోంది.

Follow Us
ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయిన కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్
ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయిన కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ
బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..
బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..
'శ్రీరాముడిగా' సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. కానీ..
'శ్రీరాముడిగా' సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. కానీ..
ఎర్రగా నిగనిగలాడే ఆపిల్స్ చూసి మోసపోకండి.. స్వీట్ ఆపిల్స్‌ని..
ఎర్రగా నిగనిగలాడే ఆపిల్స్ చూసి మోసపోకండి.. స్వీట్ ఆపిల్స్‌ని..
ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం
ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం
మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 
మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 
 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?
 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?