Video: సైకిల్‌పై 100 గ్రామాలు.. 100 ఎపిసోడ్లు.. ఐరిష్ యువకుడి సాహసం!
Irish cyclist in India: ప్రపంచాన్ని చుట్టిరావాలనే కల చాలా మందికి ఉంటుంది. కొందరు ఉద్యోగాలను వదిలి చేతిలో డబ్బులు, ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన హోటళ్లు లేకుండానే ప్రయాణం మొదలుపెడతారు. అలాంటి సాహసమే చేస్తున్నాడు ఐర్లాండ్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు షేన్. తన 9 టు 5 ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ఓ సైకిల్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో సైకిల్ యాత్ర పూర్తి చేసుకుని భారత్‌కు చేరుకున్నాడు. 100 గ్రామాల్లో పర్యటించి, ప్రజల జీవనశైలి, సంస్కృతి, ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

100 Villages Challenge: షేన్‌కు భారత్‌లో పర్యటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఏడాది వ్యవధి వీసా తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో తన సైకిల్ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని భారత్ చేరుకున్నాడు. ఇటీవల ఢిల్లీలో శశాంక్ శర్మ అనే వ్యక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో తన పర్యటన ఎలా ఉండబోతోందో వివరించాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడపాలని షేన్ భావిస్తున్నాడు. మొత్తం 100 గ్రామాలను సందర్శించి, ప్రతి గ్రామంపై ఒక్కో ఎపిసోడ్ రూపొందించాలని ప్లాన్ చేసుకున్నాడు. అంటే 100 గ్రామాలు 100 ప్రత్యేక కథలు అన్నమాట!
రోడ్డు పక్కనే వంట.. ఆరుబయటే నిద్ర!
ఈ ప్రయాణంలో తనకు అవసరమైన వస్తువులన్నింటినీ సైకిల్‌పైనే తీసుకెళ్లాలని షేన్ నిర్ణయించుకున్నాడు. ఖరీదైన హోటళ్లలో బస చేయడం కాకుండా రాత్రిపూట ఆరుబయట నక్షత్రాల కింద క్యాంపింగ్ చేయాలని భావిస్తున్నాడు. అలాగే ఆహారాన్ని రోడ్డు పక్కనే స్వయంగా వండుకోనున్నాడు. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలను దగ్గరగా చూడటం, స్థానిక ప్రజలతో మాట్లాడటం, వారి ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానాన్ని తెలుసుకోనున్నాడట
From Ireland to India on a Bicycle: 29-Year-Old Traveller Takes on 100 Villages Challenge
View this post on Instagram
భారత్ తర్వాత శ్రీలంకకు సైకిల్ యాత్ర!
భారత్‌లో తన యాత్రను ఉత్తరం నుంచి దక్షిణం వైపు కొనసాగించనున్నాడు. ఆ తర్వాత ఫెర్రీ ద్వారా శ్రీలంకకు వెళ్లి సైకిల్‌పైనే దేశం మొత్తం చుట్టిరావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇలా రెండు దేశాల్లో స్థానిక ప్రజల జీవితాలను, సంస్కృతులను తన వీడియోల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నాడు.
Shane cyclist has no support, no hotel, to camp under stars, to cook food roadside
View this post on Instagram
సోలో ప్రయాణికుడికి నెటిజన్ల అభినందనలు
ఒంటరిగా ప్రయాణించాలనుకునేవారికి ఏమైనా సలహా ఇస్తారా? అని అడిగినప్పుడు షేన్ ఆసక్తికరంగా స్పందించాడు. ‘భారత్, ఆఫ్ఘనిస్థాన్ గురించి ఇంటర్నెట్‌లో పూర్తి సమాచారం దొరకడం కష్టం. ప్రయాణం చేస్తూ తెలుసుకోవలసిందే,’ అన్నాడు. షేన్ సాహస యాత్రను అభినందిస్తూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘చాలా బాగుంది.. నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’, అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నేను కెనడాకు చెందిన వ్యక్తిని ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాను. భారత్ లో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఉంటారు,’ అని మరో వ్యక్తి స్పందించాడు. ఉద్యోగ జీవితాన్ని పక్కనపెట్టి ఓ సైకిల్‌తో వందలాది కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమైన షేన్ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్‌లోని 100 గ్రామాల్లో అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో తన వీడియోల్లో ఎలాంటి కథలను ప్రపంచానికి చూపిస్తాడో చూడాలి!