భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తింటే శరీరంలో ఏం జరుగుద్దీ!

samatha

9  November 2026

Pic credit - Pinterest

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంచిది ప్రతి రోజూ చిన్న మొత్తంలో బెల్లం తింటుంటారు.

బెల్లం

అంతే కాకుండా కొంత మంది మరీ స్పెషల్‌గా భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటారు. మరి ఇలా ఎందుకు తింటారు?

భోజనం తర్వాత తినడం

భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూసేద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

బెల్లం జీర్ణ ఎంజైమ్స్ ను యాక్టివ్ చేస్తుంది.  అందువలన భోజనం చేసిన తర్వాత తినడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం తగ్గుతుంది.

జీర్ణ్రక్రియ ఆరోగ్యం

బెల్లంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వలన రక్తంలోని మలినాలను తొలగించి, రక్తహీనత తగ్గిస్తుంది.

రక్తహీనత

అదే విధంగా చలికాలంలో బెల్లం తినడం వలన ఇది శరీరానికి వేడినిస్తుంది. జలుబు, దగ్గు త్వరగా రాకుండా కాపాడుతుంది.

శరరీంలో వేడి నింపడం

భోజనం తర్వాత గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉంటే, బెల్లం ముక్క తింటే క్లియర్ అయిపోతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

గొంతు క్లీనింగ్

అంతే కాకుండా, బెల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత తగ్గించడానికి సహాయపడుతుంది.

ఎముకల బలం