AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దేశాన్ని కుదిపేసిన జంట హత్య.. OTTని షేక్ చేస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో 8.1 రేటింగ్

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా దేశాన్ని కుదిపేసిన ఓ సంచలన హత్య కేసు ఆధారంగా తెరకెక్కినదే.

OTT Movie: దేశాన్ని కుదిపేసిన జంట హత్య.. OTTని షేక్ చేస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో 8.1 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 09, 2026 | 9:45 PM

Share

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఆడియెన్స్ ఇప్పుడు ఎక్కువగా హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందులోనూ ప్రముఖ వ్యక్తులు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీ గురించే. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఓ జంట హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా రిలీజై చాలా ఏళ్లయినా ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ కు 8.1/10 రేటింగ్ ఉండడం విశేషం. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒకే ఇంట్లో శృతి అనే చిన్నారి, వారి ఇంట్లోనే పనిచేసే ఖేమ్‌పాల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురవుతారు. సంఘటన జరిగిన సమయంలో ఇల్లు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులపైనే అనుమానం వ్యక్తం చేస్తారు. పరువు హత్యేనంటూ ప్రాథమిక ముగింపునకు వచ్చి విచారణ ముగిస్తారు. అయితే అసలు మిస్టరీ అక్కడి నుంచే మొదలవుతుంది.

కేసు తీవ్రత దృష్ట్యా దీనిని సీబీఐకి అప్పగిస్తారు. రొటీన్ విచారణకు భిన్నంగా తల్లిదండ్రులను నిర్దోషులుగా భావిస్తూ విచారణను సరికొత్త కోణంలోకి తీసుకెళ్తారు. పనిమనిషి స్నేహితులపై అనుమానంతో ‘ట్రూత్ సీరమ్’ పరీక్షలు నిర్వహించి అసలు నిజాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. మరి చివరకు ఈ కేసు ఎలా పరిష్కారమైంది? ఆ జంట హత్యలు చేసిందెవరు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఓటీటీలో ట్రెండింగ్ అవుతోన్న ఈ సినిమా పేరు తల్వార్. 2008లో నోయిడాలో జరిగిన ఆరుషి తల్వార్ హత్య కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌, కొంకణా సేన్ శర్మ, నీరజ్ కాబీ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అ వుతోంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

తల్వార్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దేశాన్ని కుదిపేసిన జంట హత్య.. OTTలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
దేశాన్ని కుదిపేసిన జంట హత్య.. OTTలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
విరమిస్తాడా.. విరుచుకుపడతాడా..? పశ్చిమాసియాలో ట్రంపరేషాన్లు..
విరమిస్తాడా.. విరుచుకుపడతాడా..? పశ్చిమాసియాలో ట్రంపరేషాన్లు..
క్షణాల్లో చేసుకోగలిగే జ్యుసీ చికెన్ స్నాక్..
క్షణాల్లో చేసుకోగలిగే జ్యుసీ చికెన్ స్నాక్..
నోటి పూతలను తగ్గించడంలో తమలపాకు మ్యాజిక్‌ తెలిస్తే వదిలిపెట్టరు..
నోటి పూతలను తగ్గించడంలో తమలపాకు మ్యాజిక్‌ తెలిస్తే వదిలిపెట్టరు..
రోడ్డుపై వెళ్తుండగా ఏదో కదులుతూ కనిపించింది.. బైక్ చూస్తే గుండె..
రోడ్డుపై వెళ్తుండగా ఏదో కదులుతూ కనిపించింది.. బైక్ చూస్తే గుండె..
సంపద, ఐశ్వర్యం పెరగాలంటే ఈ రుద్రాక్ష ధరించండి.. లక్ష్మీదేవి..
సంపద, ఐశ్వర్యం పెరగాలంటే ఈ రుద్రాక్ష ధరించండి.. లక్ష్మీదేవి..
ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయిన కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్
ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయిన కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ