AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా కైఫ్.. అచ్చం అమ్మలాగే ఉన్నాడుగా.. ఫొటోస్ ఇదిగో

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మొదలు సామాన్య జనాల వరకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇదే సందర్భంగా, ఈ జంట తమ కుమారుడి ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Katrina Kaif: ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా కైఫ్.. అచ్చం అమ్మలాగే ఉన్నాడుగా.. ఫొటోస్ ఇదిగో
Katrina Kaif
Basha Shek
|

Updated on: Nov 08, 2026 | 7:19 PM

Share

బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఈ దీపావళికి తమ అభిమానులకు ఒక ప్రత్యేక కానుక ఇచ్చారు. తమ ముద్దుల కొడుకు విహాన్‌తో కలిసి దిగిన మొదటి ఫోటోను పంచుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తమ కుమారుడి మొదటి పుట్టినరోజు జరిగిన ఒక రోజు తర్వాత పంచుకున్న ఈ అందమైన ఫోటోలో, ముగ్గురూ సాంప్రదాయ దుస్తులలో ఎంతో అందంగా కనిపించారు. కత్రినా కైఫ్ ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ, ‘ఇప్పటివరకు జరిగిన దీపావళులలోకెల్లా ఇదే అత్యంత ప్రకాశవంతమైనది. ప్రతిఒక్కరూ ప్రేమ, వెలుగు, ఆనందంతో ఆశీర్వదించబడాలి’ అని అందరికీ దీపావళి విషెస్ చెప్పింది క్యాట్. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ ఫోటోలో చిన్నారి విహాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. క్రీమ్ రంగు కుర్తా-పైజామా, పసుపు రంగు నెహ్రూ జాకెట్ ధరించిన విహాన్, తన తల్లిదండ్రుల మధ్య నిలబడి కెమెరా వైపు చూసి నవ్వుతున్నాడు. పసుపు రంగు ఎంబ్రాయిడరీ దుస్తులలో మెరిసిపోతున్న కత్రినా, నేలపై కూర్చుని తన కొడుకును ప్రేమగా పట్టుకుంది. క్రీమ్ రంగు కుర్తా ధరించిన విక్కీ కౌశల్, తన కొడుకు పక్కన కూర్చుని నవ్వుతున్నాడు.

కాగా నవంబర్ 07న విహాన్‌ మొదటి పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. కత్రినా, విక్కీ నవంబర్ 7, 2025న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆ తర్వాత 2026 జనవరిలో, తన కొడుకు చిన్ని చేతిని పట్టుకున్న ఫోటోను పంచుకుంటూ, అతనికి విహాన్ కౌశల్ అని పేరు పెట్టినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆసక్తికరంగా, విక్కీ కౌశల్ 2019లో వచ్చిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో మేజర్ విహాన్ సింగ్ షేర్‌గిల్ పాత్రను పోషించాడు. విక్కీ తన అభిమాన పాత్ర పేరును తన కొడుకుకు పెట్టుకోవడం గమనార్హం. ఇక 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కత్రినా, విక్కీ వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

భర్త, కుమారుడితో కత్రినా కైఫ్..

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మొత్తానికి కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ల కుమారుడి ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విహాన్ అచ్చం అమ్మలాగే చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

View this post on Instagram

A post shared by VOGUE India (@vogueindia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక
ఈ 4 రాశులకు అదృష్టం.. నవంబర్ 12లోపు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని..
ఈ 4 రాశులకు అదృష్టం.. నవంబర్ 12లోపు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని..
డబుల్ అయిన పటాకుల ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..
డబుల్ అయిన పటాకుల ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..
హామిల్టన్‌లోనూ వర్షం ముప్పు.. మూడో వన్డే జరగడం కష్టమేనా?
హామిల్టన్‌లోనూ వర్షం ముప్పు.. మూడో వన్డే జరగడం కష్టమేనా?
'రామాయణ్' పై అలనాటి సీతమ్మ షాకింగ్ కామెంట్స్
'రామాయణ్' పై అలనాటి సీతమ్మ షాకింగ్ కామెంట్స్
దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌లో నష్టాలు.. తొమ్మిదేళ్ల తర్వాత రివర్స్‌
దీపావళి మూరత్‌ ట్రేడింగ్‌లో నష్టాలు.. తొమ్మిదేళ్ల తర్వాత రివర్స్‌
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఘన విజయం
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఘన విజయం
వెండి విగ్రహాలు నల్లగా మారాయా? కొత్తవాటిలా మెరిపించే చిట్కా
వెండి విగ్రహాలు నల్లగా మారాయా? కొత్తవాటిలా మెరిపించే చిట్కా