AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: పుట్టిన పది రోజులకే బతకడన్నారు.. జబర్దస్త్ రామ్ ప్రసాద్ జీవితంలో ఇంత విషాదముందా?

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ అదరగొడుతున్నాడు. మరీ టాప్ లెవెల్ కాకపోయినా తనదైన కామెడీ తో బిగ్ బాస్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అలాగే ఫిజికల్ టాస్కుల్లోనూ దుమ్మురేపుతున్నాడు.

Bigg Boss Telugu 10: పుట్టిన పది రోజులకే బతకడన్నారు.. జబర్దస్త్ రామ్ ప్రసాద్ జీవితంలో ఇంత విషాదముందా?
Bigg Boss Telugu 10, Jabardasth Ram Prasad
Basha Shek
|

Updated on: Nov 07, 2026 | 8:43 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ పోటా పోటీగా గేమ్ ఆడుతున్నారు. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 8 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. కాగా ఈ వారం కంటెస్టెంట్స్ కు రివార్డ్ అండ్ రివేంజ్ థీమ్ తో టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఫ్యామిలీ ఫోటోలను చూపించి వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదే క్రమంలో జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ తన జీవితంలో జరిగిన పలు సంఘటనల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘మాది హ్యాపీ ఫ్యామిలీ.. వైజాగ్ లోనే పుట్టి పెరిగాను. బోలరాసి పార్వతమ్మ ఫ్యామిలీ అంటే మంచి పేరు. మా నాన్న వాళ్లు ఆరు మంది అన్నదమ్ములు.. ఇద్దరు చెల్లెలు.. మొత్తం ఎనిమిది మంది. అంతా ఒకే వీధిలోనే ఉండే వాళ్లం. దాదాపు 80 మంది ఉండేవాళ్లం. పొరపాటున ఒక్కరి బర్త్ డే జరిగినా సరే ఆ 80 మంది ఒకే ఇంటికి వెళ్తాము. ఆ ఖర్చు భరించలేక ఆ బర్త్ డేలు చేయడం కూడా మానేశాం. నేను చదువులో బాగా వీక్. అందుకే పదవ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత మెడికల్ షాప్ లో రూ.500 జీతంతో ఐదు సంవత్సరాలు పనిచేశాను. నా స్నేహితులే నన్ను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లమని ఎంకరేజ్ చేశారు. దీంతో మల్టీమీడియా కోర్స్ పూర్తి చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే ఇక్కడ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాను.

‘ నా పర్సనల్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. నేను, నా భార్య మూడవ క్లాస్ నుంచే స్నేహితులం. ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీని వదిలేస్తేనే అమ్మాయిని ఇస్తామన్నారు. దీంతో ఇండస్ట్రీ వదిలేసి మెడికల్ లో నాకు అనుభవం ఉండడంతో మా మామయ్య నాకు డబ్బు ఇచ్చి బిజినెస్ పెట్టించాడు. అది కూడా బాగానే జరిగింది. హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలోనే బాబు పుట్టాడు. అయితే వాడు పుట్టిన పది రోజులకే బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి వెళ్లమన్నారు. దీంతో చంటి పిల్లాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాను. అక్కడ బాబును ఒక గ్లాసులో పెట్టి మిషన్తో వాడి గుండెకు సూదులు పంపించేవాళ్లు. అది చూసి నా గుండె తరుక్కుపోయింది. నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే గడిపాం. దేవుడి దయ వల్ల వాడు బతికేశాడు. కానీ వాడు ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు అని సంతోషపడి ఇంటికి వచ్చేలోపే మా భార్యకు ఆరోగ్యం పాడైంది. ఆమెకి నిమోనియా వచ్చి, వెంటిలేటర్ పైన పెట్టేశారు. ఇక 24 గంటలు దాటితే తప్ప ఏం చెప్పలేమన్నారు. ఏంట్రా నా బ్రతుకు ఇలా అయింది అని కన్నీళ్లు పెట్టుకున్నా. దేవుడి దయతో భార్య కూడా క్షేమంగా ప్రాణాపయం నుంచి బయట పడింది. సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోయినా మా మామయ్య, నా భార్యను ఒప్పించుకొని మరి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను’ అని తన స్టోరీని చెప్పి అందరినీ ఎమోషనల్ కు గురి చేశాడు రామ్ ప్రసాద్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us