నవంబర్ 28 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కొత్త అవకాశాలు.. ఆర్థికంగా మంచి రోజు
Horoscope Today (November 28, 2026): శనివారం.. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపించనున్నాయి. మరికొందరికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, వృత్తి వ్యాపారాల్లో లాభాలు, కుటుంబ వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి నేటి రాశిఫలాలు తెలుసుకోండి.

దిన ఫలాలు (నవంబర్ 28, 2026): మేష రాశి వారికి ఈ రోజు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశముంది. అనవసర సహాయాలు చేయకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా సాగుతాయి. మాటకు సర్వత్రా విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయత్నాలన్నీ సాను కూల ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు. మంచి స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయ వృద్ధికి బాగా అవకాశముంది. అనవసర సహాయాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కొనసాగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయిపోతారు. ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబ పరిస్థితులు బాగానే ఉంటాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల విషయంలో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తు కోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయం నిలక డగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వా మితో విభేదాలు పరిష్కారమై, సామరస్యం ఏర్పడుతుంది. ఇరుగు పొరుగుతో వాదనలకు దిగ వద్దు. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దగ్గర బంధువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను అభివృద్ది బాట పట్టిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ పరిస్థితులు చాలావరకు ప్రశాంతంగా, సామరస్యంగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఇష్టమైన ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. పొదుపు సూత్రాలు పాటించే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరి ష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీ అవుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడక పోవడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవకార్యాల్లో పాల్గొనడం, ఆలయాల సందర్శన చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లాభపడతారు. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్త వుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగు తుంది. కొందరు బంధువుల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.



