Jabardasth Faima: తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా? జబర్దస్త్ ఫైమాపై నెటిజన్ల విమర్శలు.. ఏం జరిగిందంటే?
సాధారణంగా జబర్దస్త్ ఫైమాపై ఎక్కువగా ట్రోల్స్, విమర్శలు రావు. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఒక పనితో నెట్టింట తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ జబర్దస్త్ ఫైమా ఏం చేసింది?

జబర్దస్త్ ఫైమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ కు బోలెడు క్రేజ్, పాపులారిటీ ఉంది. పటాస్ కార్యక్రమంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ తో మరో మెట్టు పైకెక్కింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ సందడి చేసింది. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ పార్టిసిపేట్ చేస్తూ బిజి బిజీగా ఉంటోంది ఫైమా. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడమే కాకుండా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలన్నింటినీ షేర్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫైమా తాజాగా షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తైగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఫైమా గత కొద్ది నెలల క్రితం తన ప్రియుడు ప్రవీణ్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే తాజాగా ఫైమా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక వీడియోషేర్ చేసింది. అందులో ఒక ఆస్పత్రిలో డాక్టర్ ఫైమాతో ‘మీరు తల్లి కాబోతున్నారు’ అంటూ కంగ్రాట్స్ చెప్పారు. దీంతో సంతోషంతో ఫైమా ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోయింది. అభిమానులు, నెటిజన్లు కూడా ఇక్కడి దాకా చూసి చాలా సంబరపడ్డారు. ఫైమాకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చింది ఫైమా.
‘మీరు కూడా ఇలాంటి గుడ్ న్యూస్ వినాలి అనుకుంటే ఈ ఆస్పత్రిలో చికిత్స తీసుకోండి’ అంటూ ఒక హాస్పిటల్ ను ప్రమోట్ చేసింది ఫైమా. ఇదంతా చూశాక అభిమానులు అయోమయంలో ఉండిపోయారు? ఫైమా నిజంగానే తల్లి కాబోతుందా? లేదంటే ఈ హాస్పిటల్ ను ప్రమోట్ చేయడం కోసం తల్లి కాబోతున్నట్టు నటించిందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆస్పత్రి ప్రమోషన్ల కోసం ఇలా తల్లి అయినట్లు సంబరాలు చేసుకోవడం బాలేదంటూ ఫైమాపై విమర్శలు చేస్తున్నారు. మరి నిజంగానే ఫైమా తల్లి కాబోతుందా? లేదంటే హాస్పిటల్స్ ప్రమోషన్ లో భాగంగానే అలా చేసిందా? అన్నది తెలియాలంటే ఫైమానే స్పందించాలి. అయితే ఇటీవల ఒక ఇంటర్యూలో ప్రెగ్సెన్సీ విషయంపై మాట్లాడిన ఫైమా.. ప్రస్తుతానికైతే అలాంటి గుడ్ న్యూస్ ఏమీలేదని ఏదైనా ఉంటే కచ్చితంగా ముందుగా మీతోనే షేర్ చేసుకుంటారని తెలిపింది.
జబర్దస్త్ ఫైమా షేర్ చేసిన వీడియో
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
