AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: దూసుకెళ్లిన బంగారం ధరలు.. మరోసారి భారీ మార్పులు.. నవంబర్ 28న తులం ఎంతంటే..?

బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ డిమాండ్ కారణంగానే దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. అమెరికా డాలర్ పెరుగుదల, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు వంటివి బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold Prices: దూసుకెళ్లిన బంగారం ధరలు.. మరోసారి భారీ మార్పులు.. నవంబర్ 28న తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Nov 28, 2026 | 6:46 AM

Share

అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. రోజురోజుకు పెరుగుతున్న ఈ ధరలతో సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పండుగలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చ. ఈ పరిస్థితి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత సవాల్‌గా మారనుంది. డిసెంబర్ 4న అమెరికా నిరుద్యోగ గణాంకాలు వెలువనుడగా.. ఆ తర్వాత యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ప్రకటన చేయనుంది. ఇవి బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు మరింత తగ్గించే అవకాశం ఉంది. దీంతో కొనుగోలుదారులు వేచి ఉండే ధోరణి పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నేటి బంగారం ధరలివే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,710గా ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,410గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,710గా ఉంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,560కు విక్రయిస్తుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,860కు లభిస్తోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,710గా ట్రేడవుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,410గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,710 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,70,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.1.70 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.1,70,100గా ట్రేడవుతోంది. చెన్నై, బెంగళూరులోనూ కేజీ సిల్వర్ రేటు రూ.1,70,100గా ట్రేడవుతోంది.

Follow Us