AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“కుర్చీ మడతపెట్టి” కాదు.. కారు స్టీరింగ్ కూడా మ‌డ‌త‌పెట్టొచ్చు.. ఆ స్పెషల్ కారు ఇదే !!

చైనాకు చెందిన ప్రముఖ సంస్థ BYD (Build Your Dreams) వాహనాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. లేటెస్ట్ గా BYD తన Fang Cheng Bao బ్రాండ్ నుంచి సరికొత్త ఫుల్ సైజ్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV "Fang Cheng Bao Ti 9"ని విడుదల చేసింది. ఈ కారులో మడతపెట్టే స్టీరింగ్ వీల్ ఉండడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

కుర్చీ మడతపెట్టి కాదు.. కారు స్టీరింగ్ కూడా మ‌డ‌త‌పెట్టొచ్చు.. ఆ స్పెషల్ కారు ఇదే !!
Byd Fang Cheng Bao Ti 9
Korivi Jayakumar
|

Updated on: Nov 27, 2026 | 9:46 PM

Share

చైనాకు చెందిన ప్రముఖ సంస్థ BYD (Build Your Dreams) వాహనాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ టెక్నాలజీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల తయారీలో తనదైన ముద్ర వేసుకుంది. అధునాతన బ్యాటరీలు, వినూత్న డిజైన్లు, కొత్త టెక్నాలజీతో ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త మోడళ్లను పరిచయం చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన Fang Cheng Bao బ్రాండ్ ప్రధానంగా ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన SUVల తయారీపై దృష్టి సారిస్తోంది.

ఈ క్రమంలో లేటెస్ట్ గా BYD తన Fang Cheng Bao బ్రాండ్ నుంచి సరికొత్త ఫుల్ సైజ్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVని విడుదల చేసింది. అదే Fang Cheng Bao Ti 9. ఆకట్టుకునే బాక్సీ డిజైన్, 536 HP పవర్, పూర్తిగా విద్యుత్‌తో 400 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం.. పెట్రోల్‌తో కలిపి 1,630 కిలోమీటర్ల వరకు రేంజ్ వంటి ప్రత్యేకతలతో ఈ SUVని తీసుకొచ్చింది. అంతేకాకుండా మడతపెట్టే స్టీరింగ్ వీల్, భారీ డిస్‌ప్లేలు, లగ్జరీ సీట్లు వంటి అధునాతన ఫీచర్లను అందించింది. మరి ఈ కొత్త SUV ధర ఎంత? ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం…

BYD Fang Cheng Bao Ti 9 ఫీచర్స్..

మడతపెట్టే స్టీరింగ్ వీల్..

BYD Fang Cheng Bao Ti 9లో అందరినీ ఆకర్షించే మరో ప్రత్యేక ఫీచర్ ఫోల్డబుల్ స్టీరింగ్ వీల్. కంపెనీ దీన్ని ‘ఫోల్డబుల్ స్మార్ట్ క్యాబిన్’గా పరిచయం చేసింది. ఈ స్టీరింగ్ వీల్‌ను 0 నుంచి 180 డిగ్రీల వరకు మడతపెట్టుకునే అవకాశం ఉంది. రోబోటిక్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ప్రత్యేక హింజ్‌లు, మోటార్ల సాయంతో ఇది పనిచేస్తుంది. సుమారు 10 సెకన్లలో స్టీరింగ్ వీల్ మడతపడుతుంది. అయితే వాహనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫీచర్ పనిచేయదని.. కారు పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే స్టీరింగ్‌ను మడతపెట్టుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

ధర..

BYD Fang Cheng Bao Ti 9 SUVని చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 2,79,900 యువాన్లు కాగా భారత కరెన్సీలో సుమారు రూ.38 లక్షలకు పైగా ఉంటుంది. అమెరికన్ కరెన్సీలో దీని విలువ సుమారు 41,800 డాలర్లుగా వెల్లడించారు.

డిజైన్, కొలతలు..

ఈ SUV డిజైన్ విషయానికి వస్తే బాక్సీ ఆకారంలో దృఢంగా, స్పోర్టీగా కనిపించేలా రూపొందించారు. ముందు భాగంలో ఒక చివరి నుంచి మరో చివరి వరకు విస్తరించిన లైటింగ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వెనుకవైపు నిలువుగా ఉండే ప్రత్యేక ఆకారపు టెయిల్ లైట్లను ఏర్పాటు చేశారు. కొలతల విషయానికి వస్తే ఈ SUV పొడవు 5,270 మి.మీ., వెడల్పు 1,999 మి.మీ., ఎత్తు 1,850 మి.మీ.గా ఉంది. వీల్‌బేస్ 3,130 మి.మీ.గా ఉంది. అదనంగా 2,000 కిలోల బరువును లాగే సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ టో హిచ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

Byd Fang Cheng Bao Ti 9

Byd Fang Cheng Bao Ti 9

కలర్స్..

ఆరు రకాల ఎక్స్‌టీరియర్ రంగులు, మూడు రకాల ఇంటీరియర్ కలర్ కాంబినేషన్లలో అందుబాటులో ఉంటుంది.

536 HP పవర్..

ఈ SUVలో BYD తొలిసారిగా DMS సూపర్ హైబ్రిడ్ ఆల్‌రౌండ్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ మూడింటి కలయికతో గరిష్ఠంగా 400 కిలోవాట్ల శక్తి అంటే 536 HP పవర్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ భారీ SUV కేవలం 4.8 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

1,630 కి.మీ.వరకు రేంజ్..

BYD Ti 9లో మరో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ సామర్థ్యం, ప్రయాణ పరిధి. ఇందులో 66.48 kWh సామర్థ్యం కలిగిన LFP Blade 2.0 బ్యాటరీని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. పెట్రోల్, విద్యుత్ రెండింటి సహాయంతో మొత్తం 1,630 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఇవి చైనా CLTC పరీక్షా ప్రమాణాల ప్రకారం వెల్లడించిన గణాంకాలుగా చెబుతున్నారు.

ఇంటీరియర్..

సీట్ల విషయానికి వస్తే నప్పా లెదర్ అప్హోల్స్టరీ, రెండో వరుసలో జీరో గ్రావిటీ సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా అన్ని వరుసల్లో వెంటిలేషన్, హీటింగ్, మసాజ్ సదుపాయాలను కల్పించారు. వీటితో పాటు 11.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్రిజ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక టేబుళ్లను కూడా ఏర్పాటు చేశారు.

God’s Eye B టెక్నాలజీ..

డ్రైవింగ్ టెక్నాలజీ విషయంలోనూ ఈ SUVలో అధునాతన ఫీచర్లను అందించారు. ఇందులో ‘God’s Eye B’ పేరుతో ఇంటెలిజెంట్ డ్రైవింగ్ అసిస్టెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది LiDAR సెన్సార్ సాయంతో పనిచేస్తుంది. రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలు, అడ్డంకులను గుర్తించేందుకు ఈ సెన్సార్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

Byd Fang Cheng Bao Ti 9 (2)

Byd Fang Cheng Bao Ti 9

సేఫ్టీ ఫీచర్స్..

ఇందులో TSC హైస్పీడ్ టైర్ బ్లోఅవుట్ స్టెబిలైజేషన్ సిస్టమ్‌ను అందించారు. వాహనం అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు టైర్ అకస్మాత్తుగా పేలితే వాహనంపై నియంత్రణ కోల్పోకుండా సహాయపడటమే ఈ వ్యవస్థ ఉద్దేశం. అలాగే ముందు చక్రాలకు సిక్స్ పిస్టన్ బ్రేక్ కాలిపర్లను ఏర్పాటు చేశారు. ఇవి బ్రేకింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Follow Us
రిసెప్షన్‌లో ఫోటోషూట్ చేస్తూ కుప్పకూలిన వరుడు.. చివరకు!
రిసెప్షన్‌లో ఫోటోషూట్ చేస్తూ కుప్పకూలిన వరుడు.. చివరకు!
మడత పెట్టే స్టీరింగ్.. ఆ స్పెషల్ కారు ఏది ? ధర ఎంతంటే ??
మడత పెట్టే స్టీరింగ్.. ఆ స్పెషల్ కారు ఏది ? ధర ఎంతంటే ??
అయ్యప్ప మాల దీక్ష వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? 41 రోజుల..
అయ్యప్ప మాల దీక్ష వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? 41 రోజుల..
ప్లే స్టోర్‌లో నకిలీ యాప్ స్కామ్.. ఎలా గుర్తించాలో తెలుసా?
ప్లే స్టోర్‌లో నకిలీ యాప్ స్కామ్.. ఎలా గుర్తించాలో తెలుసా?
'రామాయణ' సినిమాను నిలిపేయాలని పిటిషన్.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
'రామాయణ' సినిమాను నిలిపేయాలని పిటిషన్.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
డేటింగ్ యాప్ పరిచయం చివరకు చేదు అనుభవం..!
డేటింగ్ యాప్ పరిచయం చివరకు చేదు అనుభవం..!
ఇండియాలోని ఈ నదుల్లో "బంగారం" దొరుకుతుందని తెలుసా..?
ఇండియాలోని ఈ నదుల్లో
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారం దగ్గర ఈ వాస్తు..
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారం దగ్గర ఈ వాస్తు..
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
బిర్యానీ వద్దనుకుంటున్నారా? ఈ చికెన్ గార్లిక్ రైస్ ట్రై చేయండి
బిర్యానీ వద్దనుకుంటున్నారా? ఈ చికెన్ గార్లిక్ రైస్ ట్రై చేయండి