AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: ‘రామాయణ’ సినిమాను నిలిపేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

'రామాయణం' సినిమాలో అనేక విషయాలను వక్రీకరించారని ఆరోపిస్తూ, దాని ప్రదర్శనపై స్టే కోరుతూ నవంబర్ 23న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే, ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది తమ పిటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకోవాలని కోరారు. దీంతో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.

Ramayana: 'రామాయణ' సినిమాను నిలిపేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Ramayana Movie
Basha Shek
|

Updated on: Nov 27, 2026 | 9:30 PM

Share

రణబీర్ కపూర్ , యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణం’ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలకు పైగా గడిచినా, ఇప్పటికీ ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. నవంబర్ 05న దీపావళి కానుకగా విడుదలైన రామాయణ సినిమా ఇప్పటికే రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. త్వరలోనే ఈ మూవీ రూ.2000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాపై కొన్ని సంస్థలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి, దానిని నిషేధించాలని పిలుపునిచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రానికి వ్యతిరేకంగా నేరుగా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను త్వరగా విచారించలేమని చెప్పిన సుప్రీంకోర్టు, ‘కోర్టు సమయాన్ని వృధా చేయవద్దు’ అని పేర్కనడం గనమార్హం.

‘రామాయణం’ సినిమాలో అనేక విషయాలను వక్రీకరించారని ఆరోపిస్తూ, దాని ప్రదర్శనపై స్టే కోరుతూ నవంబర్ 23న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే, ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదు. దీనిని ఫిర్యాదిదారు తరఫు న్యాయవాది ప్రశ్నిస్తూ, పిటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకోవాలని అన్నారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌ను త్వరగా విచారించాలన్న వాదనకు స్పందిస్తూ, న్యాయమూర్తులు ఇలా అన్నారు. ‘రామాయణ సినిమా ఇప్పటికే విడుదలైంది, చూడాలనుకున్న వారందరూ చూశారు. దర్శక నిర్మాతలు ఈ సినిమాను తమకు అర్థమైన రీతిలో తీశారు. మీకు అర్థమైన రీతిలో సినిమా తీయండి. ‘రామాయణం’ పౌరాణిక కథపై మీకు భిన్నమైన అభిప్రాయం ఉంటే, దాని ఆధారంగా మరో సినిమా తీయండి, అంతేగానీ కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయకండి’ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరపాలని న్యాయవాదులు పదేపదే డిమాండ్ చేయగా, నిబంధనల ప్రకారం పిటిషన్‌ను వరుస క్రమంలో విచారిస్తామని న్యాయమూర్తులు నిరాకరించారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ‘రామాయణం’ చిత్రంలో పౌరాణిక కథలోని అనేక అంశాలను వక్రీకరించారని పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. ఇటీవల, కొన్ని హిందూ సంస్థలు కూడా ఈ సినిమాపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ సినిమాలో శ్రీరాముడు, లక్ష్మణుడిని బలహీనులుగా చూపించారని. రావణుడిని ఒక గొప్ప శక్తిగా, సాంఘిక సంస్కర్తగా చూపించారని మండిపడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమా కమ్యూనిస్ట్ ఎజెండాను ప్రోత్సహిస్తోందని కొందరు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'రామాయణ' సినిమాను నిలిపేయాలని పిటిషన్.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
'రామాయణ' సినిమాను నిలిపేయాలని పిటిషన్.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
డేటింగ్ యాప్ పరిచయం చివరకు చేదు అనుభవం..!
డేటింగ్ యాప్ పరిచయం చివరకు చేదు అనుభవం..!
ఇండియాలోని ఈ నదుల్లో "బంగారం" దొరుకుతుందని తెలుసా..?
ఇండియాలోని ఈ నదుల్లో
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారం దగ్గర ఈ వాస్తు..
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారం దగ్గర ఈ వాస్తు..
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
బిర్యానీ వద్దనుకుంటున్నారా? ఈ చికెన్ గార్లిక్ రైస్ ట్రై చేయండి
బిర్యానీ వద్దనుకుంటున్నారా? ఈ చికెన్ గార్లిక్ రైస్ ట్రై చేయండి
డిసెంబర్ నెలలో ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా భారీ లాభాలు..
డిసెంబర్ నెలలో ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా భారీ లాభాలు..
పూజ చేసి గంట మోగించడం మర్చిపోయారా?.. పూజ ఫలితం దక్కదా?
పూజ చేసి గంట మోగించడం మర్చిపోయారా?.. పూజ ఫలితం దక్కదా?
థైరాయిడ్ మాత్రలు సరిగ్గా కరగకపోతే శరీరానికి ఏమవుతుంది?
థైరాయిడ్ మాత్రలు సరిగ్గా కరగకపోతే శరీరానికి ఏమవుతుంది?
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరూ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరూ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..