AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలోని ఈ నదుల్లో “బంగారం” దొరుకుతుందని తెలుసా..?

బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. భారతదేశంలోని కొన్ని నదుల ఇసుకలో బంగారు రేణువులు లభిస్తాయి. ఇంతకీ ఏ ఏ నదుల్లో బంగారం లభిస్తుంది? అవి ఎక్కడ ఉన్నాయి ? ఆ వివరాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఇండియాలోని ఈ నదుల్లో బంగారం దొరుకుతుందని తెలుసా..?
Rivers With Gold In India
Korivi Jayakumar
|

Updated on: Nov 27, 2026 | 9:23 PM

Share

బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మగాళ్ల సంగతి పక్కన పెడితే మహిళలకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లిళ్లయినా, పండగలైనా, లేదా కష్టకాలంలో ఆదుకునే ఆస్తి అయినా.. మనకు ముందుగా గుర్తొచ్చేది పసిడే. అయితే మనం షాపుకెళ్లి కొనుక్కునే ఆ మెరిసే బంగారం అంత ఈజీగా మన చేతికి రాదని.. దాని వెనుక పెద్ద కథే ఉందని కొందరికి మాత్రమే తెలిసిన నిజం. సాధారణంగా మనకు దొరికే బంగారంలో ఎక్కువ భాగం భూమి లోపలి నుంచే వస్తుంది. బంగారం ఉన్న రాళ్లను గుర్తించి, అక్కడ పెద్ద పెద్ద సొరంగాలు లేదా గుంతలు తవ్వుతారు. ఆ రాళ్లను బయటకు తెచ్చి, పిండి చేసి, కొన్ని కెమికల్స్ కలిపి అందులో నుంచి అసలైన బంగారాన్ని వేరు చేస్తారు.

నదుల్లోని ఇసుక నుంచి..

అలానే కొన్ని నదులు కొండలు, బంగారు గనులు ఉన్న ప్రాంతాల మీదుగా ప్రవహిస్తాయి. నీటి ప్రవాహానికి ఆ రాళ్లు అరిగిపోయి, సన్నని బంగారు రేణువులు నీళ్లలో కొట్టుకొచ్చి నది ఒడ్డున ఉండే ఇసుకలో కలుస్తాయి. అక్కడి స్థానికులు జల్లెడ లాంటి ప్లేట్లతో ఇసుకను కడిగి, ఆ బంగారు రేణువులను ఏరుకుంటారు. ఆ విధంగానే భారతదేశంలోని కొన్ని నదుల ఇసుకలో బంగారు రేణువులు లభిస్తాయి. ఇంతకీ ఏ నదుల్లో బంగారం లభిస్తుంది? ఇసుక నుంచి దాన్ని ఎలా వెలికితీస్తారో తెలుసుకుందాం..

ఏ ఏ నదుల నుంచి అంటే..

స్వర్ణరేఖ నది..

జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించే స్వర్ణరేఖ నది బంగారు రేణువులకు ప్రసిద్ధి చెందింది. స్వర్ణరేఖ అంటే బంగారు రేఖ అని అర్థం. ఈ నదికి ఆ పేరు రావడానికి కూడా ఇక్కడి ఇసుకలో లభించే బంగారు కణాలే కారణమని చెబుతుంటారు. ఈ నది ఇసుకలో చిన్నచిన్న బంగారు రేణువులు కనిపిస్తాయి. స్థానికంగా నివసించే కొందరు ప్రజలు తరతరాలుగా నది ఇసుకను సేకరించి.. బంగారు కణాలను వేరు చేసి అమ్ముకోవడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు.

ఇబ్ నది..

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ప్రవహించే ఇబ్ నది కూడా బంగారు రేణువులు లభించే నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నది ఇసుకలో అక్కడక్కడా చిన్నపాటి బంగారు కణాలు కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ బంగారం చాలా తక్కువ మొత్తంలో లభిస్తుంది.

మహానది..

ఒడిశాలో ప్రవహించే మహానది కూడా బంగారు ఆనవాళ్లు ఉన్న నదుల్లో ఒకటిగా పేర్కొంటారు.

సోన్ నది (మధ్యప్రదేశ్ & బీహార్)..

గంగా నదికి ఉపనదైన ‘సోన్ నది’ (Son River) గర్భంలో కూడా బంగారు రేణువులు లభిస్తాయని చెబుతారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ ప్రాంతంలో పుట్టే ఈ నది ఇసుకలో పసిడి కణాలు ఉంటాయని స్థానికుల నమ్మకం.

లోహిత్ నది (అరుణాచల్ ప్రదేశ్)..

అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రవహించే ‘లోహిత్ నది’ (Lohit River) ఇసుకలోనూ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిపుణులు చెబుతుంటారు. దీనిని స్థానికులు ‘బ్లడ్ రివర్’ అని కూడా పిలుస్తారు.

Follow Us
ఇండియాలోని ఈ నదుల్లో "బంగారం" దొరుకుతుందని తెలుసా..?
ఇండియాలోని ఈ నదుల్లో
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారం దగ్గర ఈ వాస్తు..
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారం దగ్గర ఈ వాస్తు..
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
బిర్యానీ వద్దనుకుంటున్నారా? ఈ చికెన్ గార్లిక్ రైస్ ట్రై చేయండి
బిర్యానీ వద్దనుకుంటున్నారా? ఈ చికెన్ గార్లిక్ రైస్ ట్రై చేయండి
డిసెంబర్ నెలలో ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా భారీ లాభాలు..
డిసెంబర్ నెలలో ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా భారీ లాభాలు..
పూజ చేసి గంట మోగించడం మర్చిపోయారా?.. పూజ ఫలితం దక్కదా?
పూజ చేసి గంట మోగించడం మర్చిపోయారా?.. పూజ ఫలితం దక్కదా?
థైరాయిడ్ మాత్రలు సరిగ్గా కరగకపోతే శరీరానికి ఏమవుతుంది?
థైరాయిడ్ మాత్రలు సరిగ్గా కరగకపోతే శరీరానికి ఏమవుతుంది?
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరూ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరూ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేదు..
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేదు..
సూర్య-జ్యోతికల ప్రేమ అలా మొదలైందా? సీక్రెట్స్ బయటపెట్టిన లైలా
సూర్య-జ్యోతికల ప్రేమ అలా మొదలైందా? సీక్రెట్స్ బయటపెట్టిన లైలా